జాతీయ వార్తలు

కృష్ణాజలాల పంపిణీ కేసు నవంబర్‌కు వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 30: నాలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా నదీ జలాల పంపిణికి సంబందించిన పిటిషన్లు విచారణను సుప్రీం కోర్టు నవంబర్ 9వ తేదీకి వాయిదా వేసింది. మంగళవారం ఈ పిటిషన్లను జస్టిస్ దిపక్ మిశ్రా ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చాయి. కృష్ణా జలాల పంపిణీలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని వివరించేందుకు తమకు కనీసం మూడు గంటలు సమయం కావాలని తెలంగాణ తరఫున సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ కోర్టును అభ్యర్థించారు. ట్రిబ్యునల్‌లో విచారణ జరుగుతోందని, తదుపరి విచారణ సెప్టెంబర్ 7, 8 తేదీల్లో ఉందని ఆయన కోర్టు దృష్టికి తెచ్చారు. విభజన చట్టం సెక్షన్ 89 సంబంధించిన వాదనలు తుదిదశకు చేరుకున్నాయని వైద్యనాధన్ తెలిపారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల అభిప్రాయలు తెలుసుకున్న ధర్మాసనం అన్ని రాష్ట్రాల విచారణ కలిపి మూడు రోజులు మించకుండా ఉండాలని జస్టిస్ దీపక్ మిశ్రా స్పష్టం చేశారు. ఆవకాశాన్ని బట్టి నవంబరు 9వ తేదీ నుంచి మూడు రోజుల పాటు ఈ పిటిషన్లు విచారణకే సమయం కేటాయిస్తామని ఆయన ప్రకటించారు. ఆంధ్రప్రద్రేశ్ తరుఫున సీనియర్ న్యాయవాది ఎకే గంగూలీ, కర్నాటక తరపున సీనియర్ న్యాయవాది పాలీ ఎస్ నారిమన్, మహారాష్ట్ర తరపున సీనియర్ న్యాయవాది అంధ్యార్జున హాజరయ్యారు.