జాతీయ వార్తలు

‘1998 డిఎస్సీ’పై ఆరువారాల్లో నివేదిక ఇవ్వండి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 30: డీఎస్సీ-1998 కేసులో కోర్టును ఆశ్రయించిన పిటిషనర్ల అభ్యర్థనను పరిశీలించి ఆరు వారాల్లోగా నివేదిక సమర్పించాలని తెలంగాణ సిఎస్ రాజీవ్‌శర్మను సుప్రీంకోర్టు ఆదేశించింది. 1998 సంవత్సరంలో నిర్వహించిన డీఎస్సీ పరీక్షల్లో అర్హత సాధించి, ఇంటర్వ్యూలకు హాజరైనా నియామకాల్లో తమకు అన్యాయం జరిగిందంటూ కరీంనగర్ జిల్లాకు చెందిన గోపు మహేందర్‌రెడ్డితో పాటు మరో ఐదుగురు అభ్యర్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ప్రపుల్ల.సి. పంత్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందు ఈ పిటిషన్ మంగళవారం నాడు విచారణకు వచ్చింది. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం ఆరు వారాల్లో నివేదిక సమర్పించాలని సిఎస్‌ను అదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.