జాతీయ వార్తలు

చనిపోతూ.. ఆరుగురికి ప్రాణభిక్ష!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోయంబత్తూర్, ఆగస్టు 30: బ్రెయిన్‌డెడ్ అయిన ఓ ఇంజనీర్ ఆరుగురికి ప్రాణభిక్ష ప్రసాదించారు. 21ఏళ్ల సివిల్ ఇంజనీర్ యువరాజ్ ఓ ప్రమాదంలో గాయపడ్డారు. తమిళనాడులోని తిరుపూర్ జిల్లా ధారాపురంలో మార్చిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన గాయపడ్డారు. తరువాత కోలుకున్నప్పటికీ తరచూ ఫిట్స్‌వస్తూ ఉండేవి. ఒక్కోసారి అపస్మారక స్థితికి వెళ్లిపోయేవారని యువరాజ్ కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ నెల ఆయనను శ్రీరామకృష్ణా ఆసుపత్రిలో చేర్చారు. వైద్య చికిత్సకు యువరాజ్ ఏమాత్రం స్పందించలేదు. శతవిధాలా ప్రయత్నించిన వైద్యులు సోమవారం సాయంత్రం బ్రెయిన్‌డెడ్‌గా ప్రకటించారు. ఆసుపత్రి నెఫ్రాలజిస్ట్ డాక్టర్ చెరియన్ ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలిపారు. కుటుంబ సభ్యుల అనుమతి మేరకు యువ ఇంజనీర్ అవయవాలను ఆరుగురికి అమర్చారు. వైద్య నిపుణుల బృందం యువరాజ్ గుండె, కాలేయం, రెండు కిడ్నీలు, రెండు కార్నియాలు మంగళవారం ఉదయం ఆరుగురు పేషెంట్లకు అమర్చారు. రామకృష్ణా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్న ఓ పేషెంట్‌కు ఒక కిడ్నీని, కెజి ఆసుపత్రిలో మరో పేషెంట్‌కు రెండో కిడ్నీని అమర్చారు. కార్నియాలను శంకర నేత్రాలయకు, కాలేయాన్ని పిఎస్‌జి ఆసుపత్రికి, గుండెను జికెఎన్‌ఎం ఆసుపత్రికి తరలించారు. ఆయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పేషెంట్లకు వాటిని అమర్చారు.