జాతీయ వార్తలు

నీళ్లే రైతుకు జవసత్వాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సనోసర, ఆగస్టు 30: ప్రధాని పదవి చేపట్టిన తర్వాత నరేంద్ర మోదీ మంగళవారం సొంత రాష్టమ్రైన గుజరాత్‌లో తొలిసారిగా ఒక బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సభకోసం మోదీ రాజకీయంగా కీలకమైన, పటేళ్ల ప్రాబల్యం కలిగిన సౌరాష్ట్ర ప్రాంతాన్ని ఎంచుకున్నారు. గతంలో తాను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండినప్పుడు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సౌరాష్ట్ర నర్మదా అవతరణ్ ఇరిగేషన్ (సౌని) ప్రాజెక్టు మూడోదశను ప్రారంభించిన అనంతరం జరిగిన బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించారు. రైతుల సంక్షేమంకోసం తమ ప్రభుత్వం పంటల బీమాసహా ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని చెప్పారు. అంతేకాదు, భావి తరాలకోసం నీటిని పొదుపుగా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలన్నారు. నీళ్లు లభిస్తే రైతులు అద్భుతాలు సృష్టిస్తారన్నారు. ఓటర్లను ఆకట్టుకోవడానికి నోరూరించే తాయిలాలను విసిరేయడంపై తమ ప్రభుత్వానికి నమ్మకం లేదన్నారు. ‘తాయిలాల ముక్కలను విసిరేయడంద్వారా ఎన్నికల్లో విజయం సాధించవచ్చు. అయితే దేశాన్ని నడపలేరు. తాయిలాలను విసిరేయడంపట్ల మాకు నమ్మకం లేదు. రైతుల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి 16ఏళ్లపాటు ఈ ప్రాజెక్టుకోసం కృషి చేశాం’ అంటూ తన పర్యటనను విమర్శించిన కాంగ్రెస్ పార్టీనుద్దేశించి మోదీ అన్నారు. గుజరాత్‌లో త్వరలో జరగనున్న ఎన్నికలకోసం రైతులకు ఓ సందేశం ఇవ్వడానికే ప్రధాని ఇప్పుడు ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తున్నారని కాంగ్రెస్ ఇంతకుముందు విమర్శించింది.
జామ్‌నగర్ విమానాశ్రయంనుంచి సనోసరా గ్రామానికి మోదీ హెలికాప్టర్‌లో వెళ్లాల్సి ఉంది. అయితే వాతావరణం అనుకూలించక పోవడంతో ఆయన రోడ్డుమార్గంలో వెళ్లారు. తాను తొలిసారిగా గుజరాత్ ముఖ్యమంత్రి అయినప్పుడు వ్యవసాయానికి మరింత విద్యుత్ పొందడానికి ప్రభుత్వంతో పోరాటం జరిపే బదులు నీటి యాజమాన్యంపై దృష్టి పెట్టాలని తాను చెబుతూ వచ్చేవాడినని, అయితే అప్పట్లో 2-3 ఏళ్లపాటు రైతులు తన మాటను పెద్దగా పట్టించుకోలేదని అన్నారు. అయితే స్ప్రింక్లర్లు, డ్రిప్ ఇరిగేషన్, మైక్రో ఇరిగేషన్ పద్ధతుల ద్వారా నీటిని ఆదా చేయాలన్న తన విజన్‌ను ఇప్పుడు అంగీకరించిన గుజరాత్ రైతులకు తాను కృతజ్ఞతలు చెప్పాల్సి ఉందన్నారు. దీనివల్ల భూగర్భ నీటిమట్టాలు గణనీయంగా పెరిగాయన్నారు. అంతేకాను నర్మదా నదీ జలాలు మారుమూల కరవు ప్రాంతమైన కచ్ దాకా చేరుతున్నాయన్నారు. దీనివల్ల రైతుల జీవితాల్లో గణనీయమైన మార్పు వచ్చిందన్నారు. ‘నర్మదా జలాలు కచ్‌లోని ఖవడా దాకా చేరాయి. ఒకప్పుడు ఇక్కడ సరిహద్దులను కాపలా కాసే బిఎస్‌ఎఫ్ జవాన్లకు తాగునీటికోసం ఒంటెలను ఉపయోగించేవారు. అయినప్పటికీ కొద్ది ప్రమాణంలోనే వారికి నీరు లభించేది. ఇప్పుడు వారు స్నానానికి కూడా నర్మదా నది నీటిని వాడుతున్నారు’ అని మోదీ అన్నారు. నర్మదా నదీ జలాలు రైతుల జీవితాల్లో కూడా పెనుమార్పు తీసుకువచ్చాయన్నారు. ఈ సీజన్‌లో కచ్ ప్రాంత రైతులు 70వేల టన్నుల కేసరి మామిడి పండ్లను ఎగుమతి చేశారని మోదీ చెప్పారు. కరవు ప్రాంతమైన సౌరాష్టల్రోని 115 జలాశయాలను నర్మద నీళ్లతో నింపాలనేది సౌని యోజన లక్ష్యం. ఇప్పుడు ప్రారంభించిన ప్రాజెక్టుద్వారా రాజ్‌కోట్, జామ్‌నగర్, మోర్బి ప్రాంతంలోని 10 రిజర్వాయర్లు, ప్రాజెక్టులకు నర్మదా నది నీళ్లు లభిస్తాయి.

చిత్రం... సౌరాష్ట్ర నర్మదా అవతరణ్ ఇరిగేషన్ (సౌని) ప్రాజెక్టును ప్రారంభించిన అనంతరం ప్రాజెక్టులోని నీటి ప్రవాహాన్ని పరిశీలిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ. చిత్రంలో గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని, ఉపముఖ్యమంత్రి నితిన్ పటేల్ తదితరులు