జాతీయ వార్తలు

హోదాతో సమానంగా ఏపికి ప్రయోజనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 31: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చేందుకు రాజ్యాంగపరమైన అడ్డంకులు ఏర్పడ్డాయని బిజెపి రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి సిద్దార్థనాథ్ సింగ్ వెల్లడించారు. బుధవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ 14వ ఆర్థిక సంఘం సిఫారసుల మూలంగా ఏపికి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు రాజ్యాంగపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ప్రత్యేక హోదా మూలంగా లభించే ప్రయోజనాలను ఏ.పికి కల్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సిద్దార్థనాథ్ సింగ్ తెలిపారు. 14వ ఆర్థిక సంఘం సిఫారసులను అన్ని రాష్ట్రాలు ఆమోదించిన విషయం మరిచిపోకూడదని ఆయన చెప్పారు. బి.జె.పి మిత్రపక్షమైన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా అంశంపై కేంద్రాన్ని విమర్శించారని ఒక విలేఖరి ప్రస్తావించగా అది నిజం కాదన్నారు. ప్రత్యేక హోదా అనేది భావావేశంతో కూడిన అంశం అంటూ 14వ ఆర్థిక సంఘం సిఫారసుల మూలంగా ఏ.పికి ప్రత్యేక హోదా ఇవ్వటం సాధ్యం కావటం లేదని ఆయన వివరించారు. 14వ ఆర్థిక సంఘం సిఫారసులకు పార్లమెంటులో అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి, ప్రత్యేక హోదా అంశంపై బి.జె.పిని విమర్శిస్తున్న వారు కూడా ఆ సిఫారసులకు మద్దతు ఇచ్చిన విషయం మరవరాదని ఆయన స్పష్టం చేశారు. 14వ ఆర్థిక సంఘం సిఫారసులను బలపరిచినవారు ప్రత్యేక హోదా గురించి ఎలా మాట్లాడుతారని ఆయన ప్రశ్నించారు.
ఆర్థిక సంఘం సిఫారసులకు మద్దతు ఇవ్వని వారికి మాత్రమే ప్రత్యేక హోదా గురించి మాట్లాడే హక్కు ఉంటుందని చెప్పారు. రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీలతోపాటు విభజన చట్టం వెలుపల ఇచ్చిన హామీలకు కూడా కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని సింగ్ హామీ ఇచ్చారు. ఈ హామీలను అమలు చేసేందుకు సంబంధించిన పని కొనసాగుతోంది, ఆంధ్రప్రదేశ్‌కు కల్పించాల్సిన అన్ని ప్రయోజనాలను కల్పిస్తారని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చే ప్రయోజనాలపై త్వరలోనే ఒక ప్రకటన వస్తుందని ఆయన వెల్లడించారు.