జాతీయ వార్తలు

నష్టం 18వేల కోట్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, సెప్టెంబర్ 2:దేశంలోని అనేక కార్మిక సంఘాలు శుక్రవారం జరిపిన దేశ వ్యాప్త సమ్మె వల్ల జన జీవనం స్తంభించిన మాట ఎలా ఉన్నా..చతికిల పడిన ఆర్థిక వ్యవస్థ వల్ల వచ్చిన నష్టం 18వేల కోట్ల రూపాయలు. వాణిజ్యం,రవాణా, తయారీ, బ్యాంకింగ్ సహా సమ్మెట పోటుకు అన్ని రంగాలు ఠారెత్తాయి. ఈ ఒక్క రోజు సమ్మె నష్టం 16వేల కోట్ల నుంచి 18వేల కోట్ల వరకూ ఉంటుందని అసోచాం అంచనా వేసింది. సేవా రంగాలతో పాటు ఆర్థిక వ్యవస్థలో కీలకమైన అన్ని విభాగాలను బలోపేతం చేసి స్థూల జాతీయోత్పత్తిని పెంపొందించుకోవాల్సిన తరుణంలో ఈ రకమైన సమ్మెలు జరగడం ఆర్థిక వ్యవస్థకు ఎంత మాత్రం మంచిది కాదని అసోచాం తెలిపింది. ప్రభుత్వ, ప్రైవేటు, రవాణా సర్వీసులు ఆగిపోతే మొత్తం వృద్ధి రేటే దెబ్బతింటుందని పేర్కొంది. వాణిజ్యం, రవాణా, హోటళ్లు స్థూల జాతీయోత్పత్తిలో అత్యంత కీలక భాగాలని.. శుక్రవారం సమ్మె వల్ల వీటికి తీవ్ర నష్టం వాటిల్లిందని, బ్యాంకింగ్ కూడా చతికిల పడిందని తెలిపిందని అసోచాం సెక్రటరీ జనరల్ డిఎస్ రావత్ తెలిపారు. సమ్మెలకు దిగి ఆర్థికంగా తీవ్ర నష్టం కలిగించే కంటే తమ డిమాండ్ల పరిష్కారానికి కార్మిక సంఘాలు మధ్యేమార్గంలో ముందుకెళ్లడమే శ్రేయోదాయకమన్నారు. కార్మికులకు తగిన జీతాలు ఉండాల్సిందేనని, అలాగే వారి జీవన ప్రమాణం కూడా మెరుగు పడాలనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. అయితే ఈ కనీస జీతాల డిమాండ్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర భారంర వేసేది కాకూడదని స్పష్టం చేశారు. నేటి సమ్మె వల్ల దేశీయంగానే కూడా విదేశీ రవాణాలకూ ఇబ్బంది కలిగిందని, ఆర్థిక, బ్యాంకింగ్ సేవలూ ఆగిపోవడంతో వీటి ఉమ్మడి ప్రభావం అత్యంత తీవ్రంగా మారిందన్నారు.

చిత్రం.... సార్వత్రిక సమ్మె సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ నగరంలో నిర్వహించిన కార్మిక మహా ప్రదర్శన