జాతీయ వార్తలు

నేతాజీ అదృశ్యంపై సస్పెన్స్ ఇంకా అలాగే ఉంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, సెప్టెంబర్ 2: నేతాజీ సుభష్ చంద్రబోస్ మరణంపై జపాన్ విడుదల చేసిన రహస్య నివేదిక చిట్టచివరిదేమీ కాదని, నేతాజీ మృతికి సంమంధించిన సస్పెన్స్ ఇంకా అలాగే ఉందని నేతాజీ మునిమనవడు, బిజెపి నాయకుడు చంద్రబోస్ వ్యాఖ్యానించారు. నేతాజీ 1945లో తైవాన్‌లో జరిగిన విమాన ప్రమాదంలోనే మరణించినట్లు జపాన్ ప్రభుత్వం రెండు రోజుల క్రితం విడుదల చేసిన రహస్య నివేదిక వెల్లడించిన విషయం తెలిసిందే. ‘ఈ నివేదికే చిట్టచివరిది కాదు. నేతాజీ అదృశ్యానికి సంబంధించిన మిస్టరీ ఇప్పటికీ అలాగే ఉంది. నేతాజీకి సంబంధించిన రహస్య పత్రాల వెల్లడి ప్రక్రియ జరుగుతున్న సమయంలో దీనిపై ఒక నిర్ణయానికి రావడం తొందరపాటే అవుతుంది. స్వాతంత్య్రం తర్వాత మొట్టమొదటిసారిగా ఎన్డీఏ ప్రభు త్వం నేతాజీకి సంబంధించిన రహస్య పత్రాలను బహిర్గతం చేసింది. ఆయనకు సంబందించిన అన్ని పత్రాలను ప్రజల ముందుంచే ప్రక్రియ జరుగుతూ ఉంది. అందువల్ల ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు వేచి చూద్దాం’ అని ఆయన అన్నారు.