జాతీయ వార్తలు

మతహింస అడ్డుకట్టకు కఠిన చట్టాలు అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 22: దేశంలో మతం పేరుతో జరుగుతున్న హింసను నిరోధించేందుకు ప్రభుత్వం కఠిన చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని వివిధ మతాలకు చెందిన నేతలు పిలుపునిచ్చారు. మిలాదుల్ నబీని పురస్కరించుకుని డిసెంబర్ 24ను అంతర్జాతీయ శాంతి దినోత్సవంగా ప్రకటించాలని సంయుక్త విలేఖరుల సమావేశంలో వారు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో హిందూ, సిక్కు, ముస్లిం, క్రిస్టియన్ మతాలకు చెందిన నేతలు పాల్గొన్నారు. మత సామరస్యాన్ని దెబ్బతీసేందుకు తక్కువ సంఖ్యలో ఉన్న శక్తులు చేసే కుట్రలను తుదముట్టించేందుకు కఠిన చట్టాలను తీసుకురావడంతో పాటు వాటిని పటిష్టంగా అమలుచేయాలని జాతీయ మైనారిటీ కమిషన్ సభ్యులు ఫాదర్ జాన్సన్ విజ్ఞప్తి చేశారు. ఇత్తెహాద్ మిల్లాత్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షుడు వౌలానా తౌజీర్ రజాఖాన్ మాట్లాడుతూ హిందువులు మాత్రమే ఆవును పూజిస్తారనే భావన ఉందని, గోవధను, గోమాంసాన్ని తినటాన్ని ఇస్లాం కూడా అనుమతించదని పేర్కొన్నారు.
గురుద్వారా బంగ్లాసాహెబ్ చైర్మన్ పరంజిత్ చందోక్ మాట్లాడుతూ దేశ ఉజ్వల భవిత కోసం అన్ని మతాలకు చెందినవారు ఐక్యంగా ఉండాల్సిన అవసరముందని అన్నారు. హిందూ మహాసభ అధ్యక్షుడు స్వామి చక్రపాణి మహరాజ్ మాట్లాడుతూ ఏ మతమూ హింసను ప్రేరేపించరాదని పిలుపునిచ్చారు.