జాతీయ వార్తలు

‘హద్దులు’ చెరిపేసిన పెళ్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, సెప్టెంబర్ 2: మాకు హద్దుల్లేవు. పెళ్లే మాకు ముద్దంటూ కాశ్మీర్‌కు చెందిన పోలీసు అధికారి పిఓకె అమ్మాయిని భాగస్వామిగా చేసుకున్నాడు. జమ్మూకాశ్మీర్ పోలీసు శాఖలో సబ్‌ఇన్స్‌పెక్టర్‌గా పనిచేస్తున్న ఒవైసీ గిలానీ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(పిఓకె)కు చెందిన ఫైజా గిలానీని పెళ్లాడారు. ముజఫరాబాద్‌కు చెందిన ఫైజా, ఒవైసీ వివాహం బంధుమిత్రులు, స్నేహితుల సమక్షంలో అహ్లాదకర వాతావరణంలో జరిగింది. 2014లోనే ముజఫరాబాద్‌లో నిఖా జరిగింది. పెళ్లి కుమార్తె తండ్రి షాబీర్ గిలానీ పిఓకెలో ఉంటారు. ఎల్‌ఓసికి అటువైపు ఒకరు, ఇటు వైపుఒకరు కావడంతో ఇద్దరూ ఒక ఇంటివారు కావడానికి సమస్యలు తలెత్తాయి. ఎల్‌ఓసి వద్ద నిత్యం ఉద్రిక్తత, అలాగే పాకిస్తాన్ అనుకూల, వ్యతిరేక ఉద్యమాల నేపథ్యంలో ఆటంకాలు ఎదురయ్యాయి. ఇరు ప్రాంతాల మధ్య తిరిగే బస్ సర్వీసు తరచూ రద్దుకావడం కూడా కారణమైంది. శ్రీనగర్-ముజఫరాబాద్ మధ్య కార్వాన్- ఎ అమన్ పేరుతో బస్సు సర్వీసు ఉంది. ఇటీవలే బస్సు సర్వీసు పునరుద్ధరించడంతో అటు నుంచి పెళ్లి కుమార్తె తరఫువారు రావడానికి వీలైంది. మొత్తానికి సోమవారం శ్రీనగర్‌లోని ఓ హోటల్‌లో ఒవైసీ, ఫైజాల వివాహవేడుక జరిగిందని సీనియర్ గిలానీ వెల్లడించారు. ఆయనా డిఎస్పీగా పనిచేసి రిటైరయ్యారు. వధువుపోస్టుగ్రాడ్యుయేట్. ఇస్లామాబాద్‌లోని నేషనల్ యూనివర్శిటీ నుంచి ఎడ్యుకేషన్, ప్లానింగ్, మేనేజ్‌మెంట్ కోర్సులో ఫైజా పిజి చేశారు.

వధూవరులు ఫైజా గిలానీ, ఒవైసీ