జాతీయ వార్తలు

సర్వత్రా ‘సమ్మె’ట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: జాతీయ కార్మిక సంఘాల పిలుపుమేరకు శుక్రవారం జరిగిన ఒక సార్వత్రిక సమ్మె కారణంగా దేశంలోని అనేక ప్రాం తాల్లో మామూలు జన జీవితం స్తంభించి పోయింది. సమ్మె ప్రభావం రవాణా, బ్యాంకులు, మైనింగ్ రంగాలపై ఎక్కువగా కనిపించింది. హ ర్యానా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఆందోళన చేస్తున్న పలువురు కార్మికులను అదుపులోకి తీసుకున్నారు. సమ్మె విజయవంతమైందని 18 కోట్ల మంది కార్మికులు ఆందోళనకు మద్దతుగా వీధుల్లోకి వచ్చారని కార్మిక సంఘాలు అంటున్నప్పటికీ పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో సమ్మె ప్రభావం పాక్షికంగానే కనిపించింది.
కాగా, ఈ ఒకరోజు సమ్మె కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థకు 16వేలనుంచి 18 వేల కోట్ల రూపాయల దాకా నష్టం వాటిల్లిందని వాణిజ్య, పారిశ్రామిక మండలుల సమాఖ్య అసోచామ్ అంచనా వేసింది. కాగా, రైల్వేలు, పౌర విమానయానం, ప్రధాన రేవులపై సమ్మె ప్రభావం లేదని, బ్యాకింగ్, బీమా, బొగ్గు గనులు, టెలికాం, రక్షణ ఉత్పత్తుల రంగాలపై సమ్మె ప్రభావం పాక్షికంగా ఉందని, రవాణా, ఉక్కు రంగాలపై దాని ప్రభావం నామమాత్రంగానే ఉందని ప్రభుత్వం తెలిపింది. కేరళ, త్రిపుర, అస్సాం, తెలంగాణ రాష్ట్రాల్లో సమ్మె కారణంగా సాధారణ జనజీవనం స్తంభించగా ఆంధ్రప్రదేశ్, మణిపూర్, హర్యానా, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, కర్నాటక, యుపి రాష్ట్రాల్లో కూడా సమ్మె ప్రభావం బాగాన కనిపించిందని కార్మిక సంఘాల సమన్వయ కమిటీ (టియుసిసి) ప్రధాన కార్యదర్శి ఎస్‌పి తివారీ చెప్పారు. పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో సమ్మె ప్రభావం పాక్షికంగానే ఉందని, ముంబయి, ఢిల్లీలాంటి మెట్రో నగరాల్లో జన జీవనం మామూలుగానే ఉందని ఆయన చెప్పారు.
అయితే ఆందోళనకు మద్దతుగా దాదాపు 18 కోట్ల మంది వీధుల్లోకి వచ్చారని, సమ్మె విజయవంతమైందని ఆయన చెప్పారు. సమ్మెకు మద్దతు భారీగా, కనీ వినీ ఎరుగని రీతిలో ఉందని, పశ్చిమ బెంగాల్, హర్యానా, ఉత్తరప్రదేశ్, అస్సాం తదితర రాష్ట్రా ల్లో ప్రభుత్వాలు పోలీసు బలగాలను ప్రయోగించడం లాంటి అణచివేత చర్యలకు పాల్పడినప్పటికీ కార్మికులు పెద్ద సంఖ్యలో సమ్మెలో పాల్గొన్నారని సిఐటియు ఒక ప్రకటనలో తెలిపింది. పశ్చిమ బెంగాల్‌లోని అనేక చోట్ల సమ్మె చేస్తున్న కార్మికుల ప్రదర్శనలపై తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన గూండాలు దాడులు చేశారని కూడా సిఐటియు ఆరోపించింది.