జాతీయ వార్తలు

మాజీ భర్తే హంతకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 22: సంచలనం కలిగించిన నటి హేమ, ఆమె లాయర్ హరీశ్ భంబానీ జంట హత్య కేసుల మిస్టరీని పోలీసులు ఛేదించారు. హేమ మాజీ భర్త, నటుడు చింతన్ ఉపాధ్యాయ్ హంతకుడని తేల్చారు. జంట హత్య కేసులో నిందితుడుగా వున్న చింతన్ పోలీసుల విచారణలో ఒక్కోసారి ఒక్కోరకంగా సమాధానాలు చెప్పాడని అడిషనల్ సిపి ఫతేసింగ్ పాటిల్ వెల్లడించారు. విచారణలో సాక్ష్యాలు లభించడంతో తన భార్యను, ఆమె లాయర్‌ను చింతన్ హతమార్చినట్లు నిర్ధారణ అయిందని పోలీసులు తెలిపారు. సోమవారం రాత్రి అదుపులోకి తీసుకుని విచారణ జరిపిన అనంతరం మంగళవారం తెల్లవారుజామున అరెస్టు చేసినట్లు వెల్లడించారు. అనంతరం చింతన్‌ను స్థానిక కోర్టులో హాజరుపరిచారు. సంచలనం కలిగించిన ఈ జంట హత్యలు ఈ నెల 11న జరిగాయి.
ఈ నెల 12న అట్టపెట్టెల్లో హేమ, హరీశ్ మృతదేహాలు లభ్యమైనప్పటినుంచి చింతన్‌ను విచారణ జరుపుతున్నారు. హేమ బంధువులు చింతన్‌పై అనుమానాలు వ్యక్తం చేయడంతో నాలుగు రోజులుగా అతనినుంచి వివరాలు సేకరిస్తున్నారు. చింతన్‌తోపాటు మరో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. హత్య, సాక్ష్యాలను తారుమారు చేశారన్న అభియోగాలపై ఆజాద్ రాజ్‌భర్, ప్రదీప్ రాజ్‌భర్, విజయ్ రాజ్‌భర్, శివకుమార్ రాజ్‌భర్ అలియాస్ సాధుల కస్టడీ మంగళవారంతో ముగిసింది. కాగా, మాజీ భార్య హేమకు ఆస్తిలో వాటా ఇచ్చేందుకు ఇష్టపడని చింతన్ ఈ హత్యలకు ఒడిగట్టాడని హేమ బంధువులు ఫిర్యాదు చేశారు. చింతన్ పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చాలని వారు అంతకుముందు డిమాండ్ చేశారు.