జాతీయ వార్తలు

తెలుగు రాష్ట్రాల మధ్యే నీటి పంపకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 7: మహారాష్ట్ర, కర్ణాటకలకు గతంలో నీటి కేటాయింపులపై గతంలో ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పులుకు విఘాతం కలిగించకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య నీటి పంపకాలు చేయాలని కృష్ణా ట్రిబ్యునల్‌కి కేంద్రం స్పష్టం చేసింది. అలాగే ఏపీ విభజన చట్టం ప్రకారం జనాభా నిష్పత్తిలో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఆస్తుల పంపకాలు చేపట్టినట్లే నీటిని సైతం పంపిణీ చేయాలని ట్రిబ్యునల్‌కి కేంద్ర తరపు న్యాయవాది తెలిపారు. సుప్రీకోర్టు స్టే విధించిన కారణంగానే 2013లో తుది తీర్పు అమలు జరగడం లేదని వివరించారు. ట్రిబ్యునల్ గతంలో ప్రకటించిన అవార్డుకి, ప్రస్తుతం జరుగుతున్న విషయాలకు సంబంధం లేదని కేంద్రం స్పష్టం చేసింది. నీటి వివాదాల్లో పరిష్కారానికి సర్వాధికారాలు ట్రిబ్యునల్‌కి మాత్రమే ఉన్నాయని ఆంధ్ర, తెలంగాణలు స్పష్టం చేశాయి.
అలాగే కృష్టా నదీ జలాల వివాదం కేవలం ఏపీ, తెలంగాణకు పరిమితం చేసే అధికారం కేంద్రానికి కానీ సుప్రీం కోర్టుకి కానీ లేదని రెండు రాష్ట్రాలు పేర్కొన్నాయి. బుధవారం నాడు జస్టిస్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు కృష్ణానదీ జలాలు కేటాయింపులు రెండు రాష్ట్రాలకు పరిమితమా లేక నాలుగు రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపులా అన్నదానిపై వాదనలు జరిగాయి. కేంద్రం తరపున సీనియర్ న్యాయవాది వసీంఖాద్రీ వాదనలు వినిపించారు. ఏపీ విభజన చట్టం ప్రధాన ఉద్దేశం రాష్ట్రాల సరిహద్దులు నిర్ణయించడం సెక్షన్ 2 (హెచ్) ప్రకారం జనాభా నిష్పత్తిలో 58.32:41.68 శాతంలో ఆస్తులను పంచడం, రెండు రాష్ట్రాలకు సంబంధించిన అన్ని అంశాలపై వివిధ సెక్షన్‌లలో విపులంగా విశదీకరించారని వాదించారు. ఆస్తులు, పీఎఫ్, పించను, సేవలు ఇలా ప్రతి ఒక్కదాన్ని పొందుపరిచారని, అలాగే నీటి విషయంలో కూడా నీటిని అస్తిగా పరిగణించారని ట్రిబ్యునల్ ముందు వసింఖాద్రీ వాదించారు. విభజన చట్టం సెక్షన్-89 ప్రకారం కృష్ణా జలాలు కేవలం రెండు రాష్ట్రాలకు మాత్రమే విభజన చేయాలని ట్రిబ్యునల్‌కి కేంద్ర తరపు న్యాయవాది స్పష్టం చేశారు. దీనికి సంబంధించి గతంలోనూ సుప్రీంకోర్టులో కేంద్రం తరపున అఫిడవిట్ దాఖలు చేసినట్లు వివరించారు. అలాగే విభజన చట్టం షెడ్యూల్ 11లోని క్లాజ్-4ను ప్రస్తావిస్తూ ఉనికిలో ఉన్న ఏపిలోని వివిధ ప్రాంతాలకు లేదా కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టులకు కేటాయింపులపై నదీ జలాలు ట్రిబ్యునల్ హామీ ఇచ్చిన నీటి వాటా యథాతథంగా ఉంటుందని పేర్కొన్నా విషయాన్ని ట్రిబ్యునల్ దృష్టికి తీసుకొచ్చారు.
ముందుగా తెలంగాణ తరపున సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ వాదనలు వినిపించారు. సెక్షన్ 89 ప్రకారం కృష్ణా జలాలు నీటి కేటాయింపులు రెండు రాష్ట్రాలకు పరిమితం చేసే అధికారం కేంద్రానికి లేదన్నారు. అంతరాష్ట్ర నీటి వివాదాల్లో అంతిమ నిర్ణయం ట్రిబ్యునల్‌కే ఉంటుందని ఈ విషయంలో సుప్రీంకోర్టు సైతం అధికారం లేదని వాదించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ తరపున ఏ.కే గంగూలీ వాదనలు వినిపిస్తూ ఏపీ విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం నీటి కేటాయింపులు రెండు రాష్ట్రాలకే పరిమితం చేయాలని విభజన చట్టంలో అప్పటి పార్లమెంట్ భావిస్తే కృష్ణా ట్రిబ్యునల్‌ను ప్రస్తావించకపోయేదని వాదించారు. ఒకవేళ కేంద్రం వాదనల ప్రకారం ఆస్తుల పంచుకున్నట్టే నీటిని పంచుకోవాలన్నది పార్లమెంట్ ఉద్దేశ్యమైతే విభజన చట్టంలో పేర్కొన్న ట్రిబ్యునల్ ఔచిత్యమేంటని ఆయన ప్రశ్నించారు. గురువారం సైతం ట్రిబ్యునల్ ముందు వాదనలు కొనసాగనున్నాయి.

త్వరలో 25 మంది
కొత్త జడ్జీల నియామకం

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 7: దేశవ్యాప్తంగా ఉన్న హైకోర్టులలో న్యాయమూర్తుల కొరత ఏర్పడి, పెండింగ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్న దశలో 25 మంది కొత్త న్యాయమూర్తులను నియమించేందుకు కేంద్రం రంగం సిద్ధం చేసింది. ఈ వారాంతంలోగా వీరి నియామకాలు జరగవచ్చుని తెలుస్తోంది. న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించి సుప్రీం కోర్టు కొలిజియం చేసిన సిఫార్సులపై కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడం పట్ల ఇటీవల సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ టి.ఎస్.్ఠకూర్ అసహనం వ్యక్త చేసిన విషయం తెలిసిందే. సుప్రీం చీఫ్ జస్టిస్ అధ్యక్షతన ఏర్పడిన ఐదుగురు సభ్యుల ఎపెక్స్ కోర్టు కొలీజియం 75 మంది నియామకాలకు సిఫార్సు చేసినా, కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడం గమనార్హం. దీనిని దృష్టిలో ఉంచుకుని వెంటనే అలహాబాద్, కలకత్తా, ఢిల్లీ, రాజస్థాన్, బోంబే హైకోర్టుతోపాటు ఇతర కోర్టులలో ఖాళీగా ఉన్న న్యాయమూర్తులను నియమించేందుకు కేంద్రం చర్యలు వేగవంతం చేసింది.