జాతీయ వార్తలు

నేడు మాస్కోకు మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 22: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో వార్షిక శిఖరాగ్ర చర్చలకోసం ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల రష్యా పర్యటనకోసం బుధవారం బయలుదేరి వెళ్లనున్నారు. రష్యాతో ఎన్నో ఏళ్లుగా ఉన్న ప్రత్యేక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడంతో పాటుగా ప్రత్యేకించి అణు విద్యుత్, హైడ్రోకార్బన్లు, రక్షణ, వాణిజ్య రంగాలు లక్ష్యంగా ఈ సారి చర్చలు జరగనున్నాయి. గురువారం ఇరువురు నేతల మధ్య చర్చల తర్వాత ఎన్నో ఒడిదుడుకులకు తట్టుకుని కాలపరీక్షకు నిలిచిన ఈ రెండు మిత్ర దేశాలు అణు విద్యుత్, రక్షణ రంగాలతో పాటుగా పలు రంగాలకు చెందిన అనేక ఒప్పందాలపై సంతకాలు చేయనున్నాయి. 2000 సంవత్సరంనుంచి ఈ రెండు దేశాల మధ్య అత్యున్నత స్థాయిలో ప్రతి ఏటా న్యూఢిల్లీ, మాస్కోలు ఏడాది విడిచి ఏడాది జరుగుతున్న విషయం తెలిసిందే.వివిధ రంగాలకు చెందిన పలు ఒప్పందాలపై సంతకాలు జరుగుతాయని తాము భావిస్తున్నాయని, వాటిలో కొన్నింటికి తుది మెరుగులు దిద్దుతున్నామని విదేశాంగ శాఖ కార్యదర్శి ఎస్ జైశంకర్ మంగళవారం విలేఖరులకు చెప్పారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ఇప్పుడున్న 10 బిలియన్ డాలర్ల స్ధాయినుంచి రాబోయే పదేళ్లలో 30 బిలియన్ డాలర్ల స్థాయికి పెంచుకోవాలని రెండు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నందున వాణిజ్య సంబంధాల విస్తరణ ప్రాధాన్యతా అంశంగా ఉంటుందని ఆయన చెప్పారు. ద్వైపాక్షిక సంబంధాలతో పాటు మోదీ, పుతిన్‌లు సిరియాలో పరిస్థితితో పాటుగా పలు ప్రపంచ సమస్యలు, ఉగ్రవాదం లాంటి అనేక అంశాలపై కూడా చర్చించనున్నారు. మనకు సంబంధించినంతవరకు ఈ చర్చలు అత్యంత ప్రధానమైనవని జైశతకర్ చెప్పారు.
రష్యాకు చెందిన చమురు, బొగ్గు రంగాల్లో మరింతగా పాలు పంచుకోవడంతో పాటుగా రత్నాల వ్యాపారం, వ్యవసాయాధారిత వ్యాపారాలులాంటి వాటిలో సహకారాన్ని మరింతగా పెంచుకోవాలని మన దేశం భావిస్తోందని జైశంకర్ తెలిపారు. అమెరికా, చైనాల తర్వాత ప్రపంచంలో అత్యధికంగా చమురును దిగుమతి చేసుకుంటున్న మన దేశం రష్యాలో చమురు, గ్యాస్ అనే్వషణ ప్రాజెక్టులో మరింతగా పాలు పంచుకోవడానికి చాలాకాలంగా ప్రయత్నిస్తోంది. రక్షణ, అణుఇంధన రంగాల్లో సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవడంపై రెండు దేశాలు చర్చలు జరుపుతాయని జైశంకర్ చెప్పారు. అయితే దీనికి సంబంధించిన వివరాలు మాత్రం ఆయన వెల్లడించలేదు. చాలా కాలంగా రష్యా మనకు ప్రధానమైన రక్షణ, వ్యూహాత్మక భాగస్వామిగా ఉంటోందని, అందువల్ల ఈ విషయంపై బోలెడంత చర్చ జరగవచ్చని జైశంకర్ తెలిపారు.
గత వారం రక్షణ రంగానికి చెందిన అత్యున్నత స్థాయి రక్షణ పరికరాల కొనుగోలు మండలి దాదాపు 40 వేల కోట్ల రూపాయల విలువైన రష్యాకు చెందిన ఎస్-400 ట్రంఫ్ ఎయిర్ డిఫెన్స్ క్షిపణి వ్యవస్థలను కొనుగోలు చేయడానికి అంగీకరాం తెలియజేసిన విషయం తెలిసిందే. కాగా, నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు సంబంధించిన వివరాలు అందజేయలని మన దఏశం రష్యాను కోరుతుందా అని అడగ్గా, విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ఇటీవల మాస్కో పర్యటన సందర్భంగా ఈ అంశం చర్చకు వచ్చిందని జైశంకర్ చెప్తూ, రష్యా స్పందన అందేదాకా దీనిపై ఎలాంటి ఊహాగానాలు చేయడం మంచిది కాదని అన్నారు.