జాతీయ వార్తలు

నీటి విడుదల తప్పలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, సెప్టెంబర్ 7: కావేరీ జలాల వివాదంపై సుప్రీం కోర్టు తీర్పుతో కర్ణాటక దిగివచ్చింది. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల ప్రకారం 15వేల క్యూసెక్కుల నీటిని పదిరోజులపాటు తమిళనాడుకు విడుదల చేయటం ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర స్థాయలో నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కర్ణాటకలోని రైతులు, విపక్షాలు పెద్దఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నప్పటికీ, సుప్రీం కోర్టు తీర్పు చెప్పటంతో నీరు విడుదల చేయక తప్పటం లేదని ప్రభుత్వం పేర్కొంది. తీర్పును పునస్సమీక్షించి, సవరణ చేయాలని కర్ణాటక సర్కారు సుప్రీంను అభ్యర్థిస్తామని పేర్కొంది.
కావేరీలో బేసిన్‌లోని కృష్ణరాజసాగర్, హారంగి, హేమవతి, కబిని రిజర్వాయర్లలో నీటి సామర్థ్యం 104టిఎంసిలు కాగా, ప్రస్తుతం 46.7 టిఎంసిలు మాత్రమే ఉన్నాయి. ‘‘రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా సుప్రీం కోర్టు తీర్పును అమలు చేయటం చాలా కష్టం. కానీ, తీర్పును ఉల్లంఘించటం రాజ్యాంగపరంగా సాధ్యం కానిపని’ అని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో మంగళవారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసిన కర్ణాటక ప్రభుత్వం ఆర్ధరాత్రి నుంచి కావేరీ జలాలను తమిళనాడుకు విడుదల చేయాలని నిర్ణయించింది. నీటి విడుదలను కర్ణాటక న్యాయ, సాంకేతిక బృందాలు పర్యవేక్షిస్తున్నాయి. కావేరీ రివర్ అథారిటీ రెండు రాష్ట్రాలను సందర్శించి పరిస్థితులను అంచనా వేస్తాయి. ‘మీరు జీవించండి.. ఇతరులను జీవించనీయండి’ అని సుప్రీం కోర్టు కర్ణాటకకు తెలిపింది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం కర్ణాటక పూర్తిగా 15వేల క్యూసెక్కుల నీరు విడుదల చేయాల్సిన అవసరం లేదు. అయిదు నుంచి ఆరు వేల క్యూసెక్కుల నీరు సహజంగానే దిగువనున్న తమిళనాడుకు పారుతాయి. మిగతామొత్తాన్ని మాత్రమే కర్ణాటక విడుదల చేయాల్సి ఉంటుంది.

తమిళనాడు వెళ్లాల్సిన రైలును బెంగళూరులో ఆపేసిన కన్నడ ఆందోళనకారులు