జాతీయ వార్తలు

హోదా వద్దనే్లదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: పద్నాల్గవ ఆర్థిక సంఘం సిఫారసుల కారణంగానే ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వలేకపోతున్నామంటూ కేంద్రం చేస్తున్న వాదనలో పస లేదని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపి జైరామ్ రమేశ్ కొట్టిపారేశారు. ఈ మేరకు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చేస్తున్న ప్రకటనల్లో ఏమాత్రం నిజం లేదన్నారు. కేంద్రం ఏపికి ప్రకటించిన ప్యాకేజీలో కొత్తదనం కూడా ఏమీ లేదన్నారు. ఈ విషయంలో ఆంధ్రా ప్రజానీకాన్ని కేంద్రం మోసగించిందని ఆరోపించారు. ఆయన మాజీ ఎంపి జెడి శీలంతో కలసి శుక్రవారం విలేఖరులతో మాట్లాడారు. రాష్ట్రాలకు ప్రత్యేక హోదా రద్దు చేయాలని 14వ ఆర్థిక సంఘం సిఫారసు చేయలేదని స్పష్టం చేశారు. కేంద్రం నుండి రాష్ట్రాలకు పన్నుల వాటాను బదిలీ చేసేందుకు ప్రత్యేక హోదా, హోదా లేని రాష్ట్రాల మధ్య తేడాను పాటించకూడదని మాత్రమే 14వ ఆర్థిక సంఘం చెప్పిందని ఆయన వివరించారు. ఏపికి హోదా ఇవ్వకూడదనే నిర్ణయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకుందని చెబుతూ, మోదీ ప్రభుత్వం ఎందుకీ నిర్ణయం తీసుకున్నదనేది మాత్రం తనకు తెలియదన్నారు.
యుపిఏ సంకీర్ణ ప్రభుత్వం రూపొందించిన విభజన చట్టంలో ఉపయోగించిన భాష వల్ల ఇబ్బందులు వస్తున్నాయంటూ జైట్లీ చేసిన ఆరోపణలను జైరామ్ రమేశ్ తీవ్రంగా ఖండించారు. పవన్ కళ్యాణ్ సభను దెబ్బకొట్టేందుకే ప్యాకేజీని ప్రకటించిదన్నారు. పోలవరం ప్రాజెక్టును ఏపి ప్రభుత్వానికి అప్పగించడాన్ని జైరామ్ రమేశ్ తీవ్రంగా వ్యతిరేకించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కాంట్రాక్టర్ మిత్రులకు ఆర్థిక ప్రయోజనం కలిగించేందుకే ఈ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతల్ని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. జాతీయ ప్రాజెక్టుగా చేపట్టిన పోలవరం నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించేందుకు రాష్ట్ర విభజన చట్టం అంగీకరించదన్నారు. ప్రాజెక్టుకు అవసరమైన పర్యావరణ, ఇతర అనుమతులను కేంద్ర ప్రభుత్వమే తీసుకోవలసి ఉంటుందనీ, కేంద్ర ప్రభుత్వమే పునరావాస చర్యలు తీసుకోవలసి ఉంటుందన్నారు. పోలవరాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్మించేందుకు అనుమతించాలంటే విభజన చట్టాన్ని సవరించవలసి ఉంటుందనీ, ఈ సవరణకు కాంగ్రెస్ ఎటువంటి పరిస్థితిలోనూ అనుమతించదని జైరామ్ రమేష్ ప్రకటించారు. పైగా ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ఏపి ప్రభుత్వానికి అప్పగిస్తే తెలంగాణ అభ్యంతరాలు లేవనెత్తే అవకాశం ఉంటుందన్నారు. అదే జరిగితే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఎన్నటికీ పూర్తి కాదని జైరామ్ రమేశ్ హెచ్చరించారు.
కేంద్ర సమాచార మంత్రి ఎం వెంకయ్యనాయుడు ఉపరాష్టప్రతి పదవి సంపాదించుకునేందుకు స్వార్థంతో వ్యవహరిస్తున్నారని జైరామ్ రమేశ్ విమర్శించారు. వెంకయ్యనాయుడు గురువారం విలేఖరుల సమావేశంలో ఉపయోగించిన పదజాలం పట్ల ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్రంలో మంత్రి పదవిని నిర్వహిస్తున్న సీనియర్ నాయకుడు ఇలాంటి భాషను ఉపయోగించవచ్చా? అని ఆయన ప్రశ్నించారు. వెంకయ్య విలేఖరులతో చెప్పింది సత్యమేవ జయతే కాదు... అసత్యమేవ జయతే అని ఆయన ఎద్దేవా చేశారు. ఉపరాష్టప్రతి పదవి కోసమే వెంకయ్యనాయుడు ఇలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.