జాతీయ వార్తలు

ప్రపంచ వేదికపై సామర్థ్యాన్ని నిరూపించుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కలబురగి (కర్నాటక), డిసెంబర్ 22: భారతీయ ఉన్నతవిద్యా సంస్థలు ప్రపంచ ర్యాంకింగ్‌లో వెనుకబడి పోకుండా ఉండడం కోసం అవి అంతర్జాతీయ వేదికపై తమకున్న అర్హతలను హైలైట్ చేయడానికి మరింత చురుగ్గా ప్రయత్నించాలని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. ప్రపంచ స్థాయి అధ్యాపక బృందం వల్ల మాత్రమే ప్రపంచ స్థాయి విద్య సాధ్యమని ఆయన స్పష్టం చేసారు. ఉత్తమమైన ర్యాంకింగ్ వల్ల విద్యార్థుల్లో నైతిక స్థైర్యం పెరగడంతో పాటుగా వారికి ఉద్యాగవకాశాలు కూడా పెరుగుతాయని, అంతేకాకుండా ప్రపంచ స్థాయి అధ్యాపకులను, ప్రతిభావంతులైన విద్యార్థులను ఆకర్షించడానికి కూడా అది దోహదపడుతుందని ఆయన చెప్పారు. మంగళవారం ఇక్కడ కర్నాటక సెట్రల్ యూనివర్సిటీ రెండవ స్నాతకోత్సవంలో రాష్టప్రతి ప్రసంగించారు. మొట్టమొదటి సారి ఈ ఏడాది మన దేశానికి చెందిన రెండు విద్యాసంస్థలు ప్రపంచ టాప్-200లో స్థానం సంపాదించడం సంతోషించదగ్గ విషయమని ఆయన అంటూ, మిగతా విద్యా సంస్థలు కూడా అదే బాటలో నడుస్తాయని తాను ఆశిస్తున్నానని చెప్పారు.
భారత దేశం శతాబ్దాలుగా నలంద, తక్షశిలలాంటి విశ్వవిద్యాలయాలద్వారా విద్యా ఉత్పత్తి, ప్రచార కేంద్రంగా ఉంటోందని, ప్రపంచం నలుమూలలనుంచి వేలాది మంది ఇక్కడికి వచ్చి విద్యను నేర్చుకునే వారని ఆయన తెలిపారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయిందని, మన ఉన్నత విద్యా సంస్థలు అంతర్జాతీయ ర్యాంకింగ్స్‌లో ఎంతో వెనుకబడి ఉంటున్నాయని ఆయన ఆవేదనగా అన్నారు. భారతీయ విద్యాసంస్థలు తమకున్న అర్హతలను ప్రపంచ వేదికలపై ప్రచారం చేసుకోవడానికి మరింత చురుకైన పాత్ర పోషించాలని గత మూడు సంవత్సరాలుగా తాను అనేక సందర్భాల్లో కోరుతూ వస్తున్నానని ఆయన చెప్పారు.
అంతర్జాతీయ స్థాయి బోధనా సిబ్బందివల్ల మాత్రమే ప్రపంచ స్థాయి విద్య సాధ్యమని ప్రణబ్ అంటూ విద్యా సంస్థల్లో బోధనా సిబ్బందిని తయారు చేయడం అత్యంత ప్రధానాంశంగా ఉండాలని అన్నారు. అంతర్జాతీయ విద్యా నెట్‌వర్క్‌ల ఏర్పాటు కార్యక్రమం (జ్ఞాన్) ఈ దిశగా ఓ మంచి ముందడుగని రాష్టప్రతి అన్నారు.