జాతీయ వార్తలు

కావేరి సలసల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, సెప్టెంబర్ 9: తమళనాడుకు కావేరి జలాలను విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు నిరసనగా శుక్రవారం వివిధ కన్నడ సంఘాలు ఇచ్చిన బంద్ పిలుపుతో మొత్తం కర్నాటక రాష్ట్రం స్తంభించి పోయింది. ప్రభుత్వ ఆర్టీసీ బస్సులు నిలిచిపోవడంతో పాటుగా ఆటోలు, క్యాబ్‌ల యూనియన్లు సైతం బంద్‌కు మద్దతు ఇవ్వడంతో రోడ్లపై వాహనాలేవీ తిరగలేదు. రాష్టవ్య్రాప్తంగా 3 వేలకు పైగా పెట్రోలు బంకులు సైతం మూతపడ్డాయి. ఇన్ఫోసిస్, విప్రోలాంటి ప్రముఖ ఐటి కంపెనీలతో పాటుగా నగర శివార్లలోని వందలాది ఐటి కంపెనీలు సైతం సెలవుప్రకటించాయి.కొన్ని కంపెనీలు మాత్రం తమ ఉద్యోగులు ఇంటినుంచే పని చేసేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకున్నాయి. జనం లేక మెట్రో రైలు సర్వీసులు సైతం ఆగిపోయాయి. సినిమా హాళ్లు, వ్యాపార సంస్థలు, విద్యాసంస్థలు కూడా మూతపడ్డంతో నిత్యం రద్దీగా ఉండే నగర ప్రధాన రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా మారాయి. చివిరికి బ్యాంకింగ్ సేవలు సైతం స్తంభించి పోయాయి. కేబుల్ ఆపరేటర్లు తమిళ చానళ్లను ప్రసారం చేయబోమని ప్రకటించారు. పలువురు సినీ తారలు సైతం రోడ్లపైకి వచ్చి బంద్‌కు మద్దతు ప్రకటించారు. బంద్ కారణంగా రైళ్లలో ఇతర ఊర్లనుంచి నగరానికి వచ్చిన వారు, నగర శివార్లలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లాల్సిన వారు ఎలాంటి వాహన సౌకర్యం లేక నానా అవస్థలు పడ్డారు. బెంగళూరుతో పాటుగా రాష్ట్రంలోని మండ్య, మైసూరు, బళ్లారి, కొప్పాళ, చిక్కబళ్లాపుర, ధర్వాడ్, కోలార్ తదితర పట్టణాల్లో సైతం జనం స్వచ్ఛందంగా బంద్ పాటించారు. కావేరి ఆందోళనలకు కేంద్ర బిందువున మండ్య జిల్లాలో ఆందోళనకారులు పలు చోట్ల బెంగళూరు-మైసూరు హైవేపై టైర్లు కాల్చి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. జిల్లాలోని కొంతమంది రైతులు నెత్తిపై బండరాళ్లు పెట్టుకుని కావేరి నదిలో వినూత్న రీతిలో నిరసన తెలిపారు. బళ్లారిలో తమిళనాడు రిజిస్ట్రేషన్ ఉన్న మూడు లారీలపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. తమిళనాడు రిజిస్ట్రేషన్ ఉన్న వాహనాలతో కర్నాటక రాష్ట్రంలోకి వెళ్లవద్దని ఆ రాష్ట్ర ప్రభుత్వం ముందే వాహన యజమానులను హెచ్చరించింది.
జోక్యం చేసుకోండి
ప్రధానికి సిఎం సిద్ధరామయ్య విజ్ఞప్తి
తమిళనాడుకు కావేరి జలాలను విడుదల చేయడంపై కర్ణాటకలో తీవ్ర స్థాయిలో ఆందోళనలు కొనసాగుతున్నందున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జోక్యం చేసుకొని తక్షణమే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించాలని కర్ణాటక సిఎం సిద్ధరామయ్య శుక్రవారం కోరారు. కావేరి జలాల వివాదంలో నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించడానికి, కర్ణాటకలో కొనసాగుతున్న అశాంతియుత పరిస్థితులను చక్కదిద్దడానికి కొన్ని గంటల ముందుగా నోటీసు ఇచ్చి ఈ సమావేశం నిర్వహించాలని ఆయన ప్రధానికి రాసిన లేఖలో కోరారు. సుప్రీంకోర్టు మధ్యంతర ఆదేశాల మేరకు తమిళనాడుకు కావేరి జలాలను విడుదల చేస్తుండటంతో కర్ణాటకలో ప్రజలు ఆందోళనకు దిగి శుక్రవారం 12 గంటల రాష్ట్ర బంద్‌కు పిలుపునివ్వడంతో సిఎం సిద్ధరామయ్య ప్రధాని జోక్యాన్ని కోరారు. ఈ విషయంలో ప్రధానికి రాసిన లేఖను ఆయన శుక్రవారం ఇక్కడ మీడియాకు విడుదల చేశారు. రాష్ట్రం లో అశాంతి ఇలాగే కొనసాగితే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై, దేశానికి పెద్ద ఎత్తున ఆదాయాన్ని, విదేశీ మారక ద్ర వ్యాన్ని తెచ్చిపెడుతున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజి (ఐటి) ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దేశ ప్రధానమంత్రిగానే కాక మొత్తం సమాఖ్య వ్యవస్థ అధినేతగా ఈ విషయం లో జోక్యం చేసుకోవాలని సిద్ధరామయ్య మోదీని కోరారు.
1995 డిసెంబర్‌లో కావేరి జలాశయాలలో నీటి మట్టాలు బాగా తగ్గిపోయి ఉన్న పరిస్థితుల్లో చోటు చేసుకున్న పరిణామాలను సిఎం తన లేఖలో పేర్కొన్నారు. ఆనాడు సుప్రీంకోర్టు సమస్యను పరిష్కరించాల్సిందిగా ప్రధానమంత్రిని కోరుతూ 1995 డిసెంబర్ 28న ఆదేశాలు జారీ చేసిందని ఆయన గుర్తుచేశారు. దీంతో అన్ని పక్షాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారం లభించిందని ఆయన పేర్కొన్నారు.

మండ్య జిల్లాలోని కెఆర్‌ఎస్ ఆనకట్ట ప్రాంతంలోకి దూసుకొస్తున్న రైతులపై పోలీసుల లాఠీచార్జీ