జాతీయ వార్తలు

దద్దరిల్లిన కాశ్మీర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూ/ శ్రీనగర్, సెప్టెంబర్ 11: జమ్మూ, కాశ్మీర్‌లో ఆదివారం జరిగిన రెండు భీకర ఎన్‌కౌంటర్లలో భద్రతా దళాలు ఏడుగురు మిలిటెంట్లను మట్టుబెట్టారు. మిలిటెంట్ల కాల్పుల్లో ఒక పోలీసు చనిపోగా, ఒక సబ్‌ఇన్‌స్పెక్టర్, మరో పౌరుడు గాయపడ్డారు. పూంఛ్ జిల్లాలో రోజంతా భద్రతా దళాలకు, మిలిటెంట్లకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మిలిటెంట్లు మృతి చెందగా, కుప్వారా జిల్లాలో చొరబాటుకు మిలిటెంట్లు జరిపిన ప్రయత్నాన్ని భద్రతా దళాలు వమ్ము చేసిన ఘటనలో నలుగురు మిలిటెంట్లు హతమైనారని పోలీసులు తెలిపారు. పూంఛ్‌లో ఆర్మీ బ్రిగేడ్ ప్రధాన కార్యాలయానికి దగ్గర్లోని నిర్మాణంలో ఉన్న మినీ సెక్రటేరియట్ భవనంలో కొంతమంది మిలిటెంట్లు దాగి ఉన్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు ఆదివారం ఉదయం ఆ భవనాన్ని చుట్టుముట్టారు. అయితే పోలీసులపై మిలిటెంట్లు పెద్ద ఎత్తున కాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో ఒక పోలీసు మృతి చెందగా, ఒక సబ్‌ఇన్‌స్పెక్టర్, మరో పౌరుడు గాయపడ్డారు. దీంతో హుటాహుటిన ఆర్మీ కమాండోలను సంఘటనా స్థలానికి పంపించారు. సాయంత్రం ఆర్మీ కమాండోలు నిర్మాణంలో ఉన్న భవనంలోకి దూసుకు పోయి అక్కడ దాగి ఉన్న ముగ్గురు మిలిటెంట్లను మట్టుబెట్టినట్లు ఓ పోలీసు ఉన్నతాధికారి చెప్పారు. మరోవైపు అధీన రేఖపై నౌగామ్ సెక్టార్‌లోని కుప్వారా జిల్లాలో కొంతమంది మిలిటెంట్లు భారత భూభాగంలోకి చొరబడడానికి యత్నిస్తుండడాన్ని గమనించిన సైనికులు వాళ్లను ఎదురించడంతో మొదలైన కాల్పుల్లో నలుగురు మిలిటెంట్లు హతమైనారు. కాగా, తంగ్‌ధార్, గురెజ్ సెక్టార్లలో కూడా రెండు చొరబాటు యత్నాలను సైనికులు భగ్నం చేశారని, అయితే ఈ రెండు సంఘటనల్లోను ఎవరూ చనిపోలేదని ఆర్మీ అధికారి ఒకరు చెప్పారు.

చిత్రం... పూంఛ్‌లో ఓ భవనంలో నక్కిన ఉగ్రవాదుల కోసం మాటువేసిన స్పెషల్ ఆపరేషన్ గ్రూప్, జమ్మూ పోలీస్ దళాలు