అంతర్జాతీయం

గుర్తింపునివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సియోల్, సెప్టెంబర్ 11: రెండు రోజుల క్రితం అణు పరీక్ష జరిపి అంతర్జాతీయంగా కలకలం రేపిన ఉత్తర కొరియా ఆంక్షల విధింపు నేపథ్యంలో మరింతగా ధిక్కార స్వరాన్ని వినిపించింది. తమను అణ్వస్త్ర దేశంగా గుర్తించాలన్న డిమాండ్‌ను పునరుద్ఘాటించింది. తాజా అణు పరీక్ష నేపథ్యంలో ఉత్తర కొరియాపై మరిన్ని ఆంక్షలను విధించేందుకు భద్రతా మండలి సమాయత్తం అవుతున్న నేపథ్యంలో తమకు అణ్వస్త్ర దేశంగా గుర్తింపు నివ్వాలని ఉత్తర కొరియా డిమాండ్ చేయడం మరింతగా వివాదాస్పదమైంది. సమీప భవిష్యత్తులోనే తమ అణు శక్తిని ఇటు గుణాత్మకంగా, అటు పరిమాణాత్మకంగానూ పెంపొందించుకుంటామని స్పష్టం చేసింది. కాగా, ఉత్తర కొరియాకు కళ్లెం వేయడానికి అత్యంత తీవ్రస్థాయిలో ఆంక్షలు విధించాల్సిందేనంటూ ఇటు అమెరికా, అటు జపాన్ గట్టిగా పట్టుబడుతున్నాయి. ప్రస్తుతం టోక్యోలో పర్యటిస్తున్న అమెరికా దౌత్యవేత్త ఈ విషయాన్ని వెల్లడించారు.
అమెరికా అణుశక్తి వల్ల తమ దేశ భద్రతకు, సార్వభౌమత్వానికి ప్రమాదం ముంచుకొచ్చే అవకాశం ఉంది కాబట్టే తాము క్షిపణి, అణు పరీక్షలను నిర్వహిస్తున్నట్టు ఉత్తర కొరియా వెల్లడించింది. అంతేకాదు, తమను హెచ్చరిస్తూ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా చేసిన వ్యాఖ్యలను అవహేళన చేసింది. తమ దేశానికి సంబంధించి ఒబామా దివాళాకోరు విధానానే్న అనుసరిస్తున్నారని తెలిపింది. ఉత్తర కొరియా అణ్వస్త్ర దేశంగా ఎదగడం ఏమాత్రం ఇష్టం లేకపోవడం వల్లే ఒబామా ఈ రకమైన చర్యలకు పాల్పడుతున్నారని ఓ అధికారిక ప్రకటనలో తెలిపింది. అంతేకాదు ‘అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడ్ని కనుమరుగు చేయాలనుకోవడం అవివేకం’ అన్న వాస్తవాన్ని గుర్తించాలని కూడా ఓ సీనియర్ అధికారిని ఉటంకిస్తూ ఆ ప్రకటన స్పష్టం చేసింది.