జాతీయ వార్తలు

కాంగ్రెస్‌ను గెలిపించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆజంగఢ్ (ఉత్తర్‌ప్రదేశ్), సెప్టెంబర్ 11: ఉత్తరప్రదేశ్‌లో పర్యటిస్తున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదివారం మరోసారి అధికార సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పి), ప్రతిపక్ష బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్‌పి)లపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ‘ఏనుగు’ (బిఎస్‌పి ఎన్నికల చిహ్నం) ఖజానాలోని సొమ్మునంతా తినేయగా, ‘సైకిల్’ (ఎస్‌పి ఎన్నికల చిహ్నం) పంక్చర్ అయి కూలబడిపోయిందని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆదివారం ఇక్కడ నిర్వహించిన ఒక బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ‘ఏనుగు ఖజానాలోని సొమ్మునంతా తిన్నది. దీంతో మీరు ఆ ఏనుగును తరిమికొట్టారు. సైకిల్‌ను అధికారంలోకి తీసుకొచ్చారు. ఈ సైకిల్ టైర్ అయిదేళ్లుగా పంక్చర్ అయ్యే ఉంది. ముందుకు పోవడం లేదు. అక్కడే కూలబడిపోయింది. ఈ పార్టీ మీకు కనీసం రేషన్ కార్డులను కూడా అందించలేకపోయింది’ అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అందువల్ల రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ఆయన ప్రజలను కోరారు. ‘ఇప్పుడు మీరు ‘చేయి’ (కాంగ్రెస్ ఎన్నికల చిహ్నం)ని గురించి ఆలోచించండి. అప్పుడు మేము రేషన్ కార్డులు జారీ చేస్తాం, రైతుల సమస్యలు పరిష్కరిస్తాం చూడండి’ అని రాహుల్ గాంధీ అన్నారు. ‘దియోరియా నుంచి దిల్లీకి’ యాత్రలో ఉన్న ఆయన ఆరో రోజయిన ఆదివారం ఆజంగఢ్ నుంచి తన యాత్రను ప్రారంభించారు. మధ్యలో కొన్ని సమావేశాలలో పాల్గొన్న ఆయన ఘాజీపూర్‌కు చేరుకున్నారు. ఆజంగఢ్.. ఎస్‌పి అధినేత ములాయం సింగ్ యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటరీ నియోజకవర్గ కేంద్రం. రాహుల్ తన పాదయాత్రలో శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరుచుగా విదేశీ ప్రయాణాలు చేయడం విరుచుకుపడ్డారు.

కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన కిసాన్ యాత్రలో ఆదివారం ఆజంగఢ్ జిల్లాలో
ఒక రోడ్ షోలో మాట్లాడుతున్న రాహుల్