జాతీయ వార్తలు

ఏమంటున్నారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13:ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించంపై రాష్ట్ర ప్రజల మనోగతమేమిటో ప్రధాని మోదీ గవర్నర్ నరసింహన్‌ను అడిగి తెలుసుకున్నట్టు తెలిసింది. గవర్నర్ మంగళవారం ఉదయం ప్రధానిని ఆయన నివాస గృహం 7, ఆర్‌సిఆర్‌లో కలుసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులపై మోదీకి ఆయన ఒక నివేదిక అందజేశారు. ఈ సందర్భంగా ఎన్‌డిఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించటంపై రాష్ట్ర ప్రజల్లో వ్యక్తమవుతున్న అభిప్రాయాల గురించి ప్రధాని ఆయనను అడిగినట్లు తెలిసింది. ప్రత్యేక ప్యాకేజీపై జనం ఏమనుకుంటున్నారు? ప్యాకేజీలో పేర్కొన్న అంశాలు వారికి ఎంతవరకూ అర్థమయ్యాయి? ప్యాకేజీ వల్ల ఆంధ్రప్రదేశ్‌కు కలిగే లాభాల గురించి తెలుగుదేశం, బిజెపి నాయకులు ఎంతవరకూ ప్రజలకు వివరించగలుగుతున్నారు? వంటి విషయాలను మోదీ వాకబు చేశారని అంటున్నారు. ప్రత్యేక హోదా మూలంగా ఏపికి కలిగే లాభాలేమిటి? ప్రత్యేక సహాయం వలన హోదా కంటే ఎంత ఎక్కువ సాయం, ప్రయోజనం రాష్ట్రానికి అందుతోందనేది ప్రజలకు వివరించగలిగారా? అని ప్రధాని గవర్నర్‌ను అడిగినట్లు తెలిసింది. ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక ఆర్థిక సహాయం ప్రకటించటంపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావటం తెలిసిందే. నరసింహన్ తన నివేదికలో ప్రజలు వ్యక్తం చేస్తున్న భిన్నాభిప్రాయాల గురించి వివరించడంతోపాటు అందుకు గల కారణాలను కూడా విశే్లషించారని అంటున్నారు. ప్రతిపక్షం తమ రాజకీయ ప్రయోజనాల కోసం హోదా అంశాన్ని భావోద్రేకాలతో ముడివడిన అంశంగా మారుస్తోందనే అభిప్రాయాన్ని నరసింహం తన నివేదికలో పేర్కొన్నారని అంటున్నారు. ప్రత్యేక ప్యాకేజీవల్ల ఏపికి కలిగే ప్రయోజనాల గురించి మరింత సమర్థంగా వివరిస్తే బాగుంటుందని నరసింహన్ సూచించారనే మాట వినిపిస్తోంది. నరసింహన్ ప్రధాన మంత్రితో దాదాపు గంటసేపు భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అనంతరం గవర్నర్ పిఎంఓకు వెళ్లి సీనియర్ అధికారులతో చర్చలు జరిపారు.
గవర్నర్‌తో సుజన, గంటా చర్చలు
తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు, కేంద్ర సైన్స్, విజ్ఞాన శాఖ మంత్రి సుజనా చౌదరి, రాష్ట్ర మానవ వనరుల మంత్రి గంటా శ్రీనివాసరావు మంగళవారం ఉదయం ఏపి భవన్‌లో గవర్నర్ నరసింహన్‌తో ప్రత్యేకంగా సమావేశమై చర్చలు జరిపారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలతోపాటు ప్రత్యేక ప్యాకేజీపై కూడా వారు చర్చించినట్టు తెలుస్తోంది. నరసింహన్ ప్రధాన మంత్రిని కలవడానికి ముందుగా సుజన, గంటా ఆయనతో చర్చించడం గమనార్హం.

చిత్రం... ఢిల్లీలో ప్రధాని మోదీతో సమావేశమైన గవర్నర్ నరసింహన్