జాతీయ వార్తలు

కదలం గాక కదలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండీగఢ్, సెప్టెంబర్ 13: పంజాబ్ అసెంబ్లీ ప్రాంగణం నుంచి కదలకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భీష్మించుకుని కూర్చోవడం రాజకీయ దుమారాన్ని రేపుతోంది. రాష్ట్ర ప్రభుత్వంపై తాము ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చకు అనుమతించాలని డిమాండ్ చేస్తూ 26 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సోమవారం రాత్రి నుంచి అసెంబ్లీలోనే బైఠాయించారు. మంగళవారం కూడా వారు కదలకపోవడంతో పరిస్థితి సంక్లిష్టంగా మారింది. మంగళవారం మధ్యాహ్నం అసెంబ్లీకి వచ్చిన సిఎం ప్రకాశ్ సింగ్ బాదల్ అభ్యర్థించినప్పటికీ అక్కడి నుంచి కదలకుండా ఎమ్మెల్యేలు మొరాయించారు. సోమవారంనాడు అవిశ్వాస తీర్మానంపై చర్చకు స్పీకర్ అనుమతించలేదు. మూజువాణీ ఓటుతో దాన్ని తిరస్కరించడంతో అలిగిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిరసనగా అసెంబ్లీలోనే బైఠాయించారు. మంగళవారం ఉదయం అసెంబ్లీ సెక్యురిటీ సిబ్బందితో ఎమ్మెల్యేలు వాగ్వుద్దానికి దిగారు. అయితే వీరందరూ అసెంబ్లీ ప్రాంగణంలో బైఠాయించడం వల్ల లోపలికి ప్రవేశించడానికి అనుమతించకపోవడంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది. తమను అసెంబ్లీలోకి అనుమతించకపోవడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని కాంగ్రెస్ సభ్యులు విమర్శించారు. అణచివేత ధోరణికి వ్యతిరేకంగా వీధులకు ఎక్కుతామని వారు హెచ్చరించారు.

అమృత్‌సర్‌లో మంగళవారం ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు