జాతీయ వార్తలు

వాస్తవాలనే ప్రసారం చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 13: కావేరి జలాల వివాదానికి సంబంధించి కొన్ని టీవీ చానళ్లు రెచ్చగొట్టే కార్యక్రమాలను ప్రసారం చేశాయని కేంద్రం అభిప్రాయపడింది. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని, శాంతి సామరస్యాలను పరిరక్షించడానికి వాస్తవాలను మాత్రమే ప్రసారం చేయాలని చానళ్ల యాజమాన్యాలను కోరింది. ‘కొన్ని టీవీ చానళ్లు హింస, అల్లర్లకు పాల్పడుతున్న దృశ్యాలను పదే పదే ప్రసారం చేస్తున్నాయి. ఇవి ఉద్రిక్తతలను మరింత రెచ్చగొట్టి, రెండు రాష్ట్రాల్లో శాంతిభద్రతల పరిస్థితులు మరింతగా దిగజారిపోయేలా చేస్తాయి’ అని కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ మంగళవారం విడుదల చేసిన ఒక అడ్వైజరీలో పేర్కొంది. శాంతిని కాపాడాలని, హింసకు, అల్లర్లకు పాల్పడవద్దని సమాచార, ప్రసారాల శాఖ మంత్రి ఎం వెంకయ్య నాయుడు ఆ అడ్వైజరీలో రెండు రాష్ట్రాల ప్రజలకు విజ్ఞప్తి ఇలాంటి సంఘటనలను ప్రసారం చేసేటప్పుడు సంయమనం పాటించాలని, తిరిగి మామూలు పరిస్థితులను నెలకొల్పడంలో సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. హింసను రెచ్చగొట్టే విధంగా వార్తలను, దృశ్యాలను ప్రసారం చేయవద్దని మీడియాను, ముఖ్యంగా కేబుల్ టీవీ చానళ్లను మంత్రిత్వ శాఖ కోరింది.