జాతీయ వార్తలు

త్వరలో గుర్తింపులేని అమెరికా వర్శిటీల జాబితా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 22: ఉన్నత చదువుల కోసం అమెరికా వెళుతున్న భారతీయ విద్యార్థులు, ముఖ్యంగా తెలుగు విద్యార్థుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతి రాజు, ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామమోహన్‌రావు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ను కోరారు. ఆమెరికాలోని గుర్తింపులేని విశ్వవిద్యాలయాల పేర్లను వీలున్నంత త్వరగా ప్రకటిస్తామని సుష్మా స్వరాజ్ వారికి హామీ ఇచ్చారు. అమెరికా విమానాశ్రయంలో దిగిన పలువురు విద్యార్థులను తిరుగు విమానంలో పంపించివేయటం గురించి వారు సుష్మాస్వరాజ్‌తో ప్రత్యేకంగా చర్చించారు. అమెరికాలోని పలు విశ్వవిద్యాలయాలకు గుర్తింపు లేని కారణంగా విద్యా సంవత్సరాన్ని కోల్పోతున్నారని వారు సుష్మాస్వరాజ్‌కు చెప్పారు. అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వకపోతే విద్యార్థులను తిరస్కరిస్తున్నారనే అంశాన్నివారు మంత్రి దృష్టికి తెచ్చారు. అమెరికాలోని గుర్తింపు లేని విశ్వవిద్యాలయాల జాబితాను వీలున్నంత త్వరగా ప్రకటించాలని అశోక్‌గజపతి రాజు,రామమోహన్‌రావు కేంద్ర మంత్రితో చెప్పారు. వీసా ఉన్న విద్యార్థులకు ఇబ్బందులు ఎదురుకాకుండా చూసేందుకు అమెరికా ప్రభుత్వంతో మాట్లాడుతామని సుష్మాస్వరాజ్ వారికి హామీ ఇచ్చారు.