జాతీయ వార్తలు

ఇవిగో మీ భూములు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింగూర్, సెప్టెంబర్ 14: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ‘సింగూరు’ కల నెరవేరింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మమత విజయానికి దోహదం చేసిన ప్రధాన అంశాల్లో టాటా మోటార్ నానో కంపెనీకోసం అప్పటి అధికార లెఫ్ట్ ఫ్రంట్ సింగూర్‌లో రైతుల నుంచి బలవంతంగా లాక్కున్న భూములను తిరిగి ఇచ్చేయడం. తాజాగా సుప్రీం కోర్టు కూడా ఈ విషయంలో ఆదేశాలు జారీ చేయడంతో బుధవారం సింగూర్ రైతులకు భూమి పట్టాను, చెక్కులను మమత పంపిణీ చేశారు. అదే సమయంలో రాష్ట్రంలో ఆటో కంపెనీలు పెట్టే వారికి స్వాగతం పలుకుతున్నానంటూ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి తా ము పెద్దపీట వేస్తున్నామని, అయి తే అందుకు రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కోవడం ఎంతమాత్రం సరైన విధానం కాదని వెల్లడించారు. సింగూరులో జరిగిన భూ సేకరణను తప్పుబట్టిన సుప్రీం కోర్టు పనె్నండు వారాల్లో సంబంధిత రైతులకు వారివారి భూమి పట్టాలను తిరిగి ఇచ్చేయాలని ఆదేశించింది. సుప్రీం తీర్పును శిరసావహించిన ముఖ్యమంత్రి మమత ఆటో కంపెనీలు ముందుకు వస్తే మిద్నాపూర్‌లోని గోల్‌తోరే వద్ద వెయ్యి ఎకరాల భూమిని కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. అందుకు టాటాలైనా బిఎమ్‌డబ్ల్యు కంపెనీ అయినా భూమిని కేటాయించేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. ఖరగ్‌పూర్, పనాగఢ్‌తోపాటు అనేక చోట్ల ఖాళీ భూములెన్నో ఉన్నాయని, వాటిలో పరిశ్రమల ఏర్పాటుకు అన్ని కంపెనీలనూ ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. సింగూరులోని వెయ్యి ఎకరాల భూమి విషయంలో అప్పటి వామపక్ష ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం వల్లే టాటాలు అక్కడ నానో కార్ల కంపెనీని ఏర్పాటు చేయలేక పోయారని మమత తెలిపారు.

సామాజిక కార్యకర్త మేధాపట్కర్‌తో మమత ముచ్చట..సింగూర్ భూమి పట్టాలు తీసుకునేందుకు వచ్చిన గ్రామస్తులు

బెదిరించి భూములు లాక్కొంటున్నారు

మల్లన్నసాగర్ విషయంలో రాజ్యాంగ ఉల్లంఘన
తెలంగాణ ప్రభుత్వంపై రాష్టప్రతికి కాంగ్రెస్ ఫిర్యాదు

ఆంధ్రభూమి ప్రతినిధి
న్యూఢిల్లీ, సెప్టెంబరు 14: మల్లన్నసాగర్ ప్రాజెక్టు విషయంలో జోక్యం చేసుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ కమిటీ రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీకి విజ్ఞప్తి చేసింది. బుధవారం సాయంత్రం తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ నాయకుల బృందం రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీని కలిసింది. భూసేకరణ వ్యవహారంపై రాష్టప్రతికి ఈ బృందం ఫిర్యాదు చేసింది. అనంతరం ఉత్తమ్‌కుమార్ రెడ్డి విలేఖరులతో మాట్లాడుతూ మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్వాసితుల విషయంలో ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనల పాల్పడుతోందని రాష్టప్రతి దృషికి తీసుకెళ్లామన్నారు. తెలంగాణ ప్రభుత్వం బలవంతంగా రైతుల నుండి భూములు లాక్కొని, కేంద్రం తీసుకొచ్చిన భూసేకరణ చట్టాన్ని తుంగలో తొక్కిందని అన్నారు. చిన్నకారు, దళితులు, గిరిజన రైతులను బెదిరించి భూములు ఎలా తీసుకొంటోందో రాష్టప్రతికి వివరించామన్నారు. గిరిజన, దళితుకున్న ప్రత్యేక చట్టాలను పట్టించుకోకుండా ప్రభుత్యం వ్యవహరిస్తోందని అన్నారు. మల్లన్న సాగర్ నిర్వాసిత గ్రామాలలో ప్రత్యేక పోలీసులను ఏర్పాటుచేసి రైతులను అణచివేస్తూ రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్న విషయాన్ని ప్రణబ్ దృషికి తీసుకెళామన్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం ప్రాజెక్టు నిర్మాణానికి భూములను సమీకరించే సమయంలో గ్రామ సభలను నిర్వహించి రైతుల అభిప్రాయాలను తీసుకోకుండా 123 చట్టం తీసుకొచ్చిందన్నారు. తెరాస ప్రభుత్వం ల్యాండ్ బ్రోకర్‌గా వ్యవహరిస్తోందని, ప్రస్తుతం ఇస్తున్న పరిహారంతో వారికి న్యాయం జరగడం లేదని రాష్టప్రతికి చెప్పామన్నారు. ఈ వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోదీతో చర్చిస్తానని రాష్టప్రతి చెప్పారని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మహారాష్టల్రో భూములు ముంపునకు గురైతే 2013 భూసేకరణ చట్టం వర్తించేలా ఒప్పందం చేసుకున్నా, తెలంగాణలో మాత్రం 123 చట్టం అమలు చేయడం సరికాదన్నారు. రెండు పంటలు పండే భూములను ముంచి ఒక పంటకోసం ప్రభుత్వం నీళ్లు ఇవ్వడం ఏంటి అని ఉత్తమ్ ప్రశ్నించారు. రాష్టప్రతి కలిసినవారిలో జానారెడ్డి, భట్టి విక్రమార్క, షబ్బీర్ అలీ, దామోదర రాజనర్సింహ, పొన్నాల లక్ష్మయ్య, సునితా లక్ష్మారెడ్డి, బలరాం నాయక్, నంది ఎల్లయ్య, పాల్వాయి గోవర్థన్ రెడ్డి ఉన్నారు.