జాతీయ వార్తలు

అఫ్గాన్‌కు అండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14: వివిధ రంగాల్లో అఫ్గాన్ తన సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం కోసం ఆ దేశానికి వంద కోట్ల డాలర్ల సాయాన్ని అందిస్తామని ప్రదాని నరేంద్ర మోదీ ప్రకటించారు. దక్షిణాసియా ప్రాంతంలో రాజకీయ ప్రయోజనాలు సాదించుకోవడానికి ఉగ్రవాదాన్ని ఒక సాధనంగా ఉపయోగించుకోవడం కొనసాగుతుండడం పట్ల భారత్, అఫ్గానిస్తాన్‌లు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉగ్రవాదులకు అన్ని రకాల ప్రోత్సాహాన్ని, వారికి ఆశ్రయం కల్పించడానికి స్వస్తి చెప్పాలని పిలుపునిచ్చాయి. పాక్ పేరును నేరుగా ప్రస్తావించనప్పటికీ పాక్‌నుద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశాయన్నది సస్పష్టం. భారత్‌లో పర్యటనకోసం బుధవారం ఇక్కడికి చేరుకున్న అఫ్గానిస్తాన్ అధ్యక్షుడు అషఫ్‌ఘ్రనీ, ప్రధాని నరేంద్ర మోదీలు ఇక్కడి హైదరాబాద్ హౌస్‌లో సమావేశమై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు భారత్-అఫ్గాన్ వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందంలో పేర్కొన్న విధంగా ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో, భద్రత, రక్షణ సహకారాన్ని బలోపేతం చేసుకోవాలన్న తమ కృతనిశ్చయాన్ని మరోసారి వ్యక్తం చేశారు.
విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, నైపుణ్యం అభివృద్ధి, మహిళా సాధికారికత, విద్యుత్, వౌలిక సదుపాయాలు తదితర రంగాల్లో అఫ్గాన్ తన సామర్థ్యాలను మరింత బలోపేతం చేసుకోవడానికి, ప్రజాస్వామ్య వ్యవస్థల బలోపేతానికి గాను భారత్ వంద కోట్ల డాలర్ల మొత్తాన్ని కేటాయించనున్నట్లు ఇరుపక్షాల మధ్య ప్రతినిధి స్థాయి చర్చల అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. నేరస్థుల అప్పగింత ఒప్పందం, పౌర, వాణిజ్య రంగాల్లో సహకారానికి సంబంధించి మూడు ఒప్పందాలపైన, అలాగే రోదసిని శాంతియుత ప్రయోజనాలకు ఉపయోగించుకోవడంపై ఒక అవగాహనా ఒప్పందంపైన ఇరు దేశాలు సంతకాలు చేశాయి.
ఉగ్రవాదాన్ని పెంచి పోషించే ఈ ధోరణి ఈ ప్రాంతానికి, మిగతా ప్రాంతాల శాంతి సుస్థిరతలకు ఏకైక అతిపెద్ద ముప్పుగా పరిణమిస్తోందనే విషయాన్ని వారు అంగీకరించారని చర్చల అనంతరం విడుదల చేసిన సంయుక్త ప్రకటన పేర్కొంది. కాగా, ఈ సందర్భంగా భారత్‌నుంచి అఫ్గానిస్తాన్‌కు ప్రపంచ స్థాయి, చౌకయిన మందులను సరఫరా చేస్తామని, సౌర విద్యుత్ రంగంలో సహకరిస్తామని కూడా మోదీ ప్రతిపాదించారు.

చిత్రం...అఫ్గానిస్థాన్ అధ్యక్షుడు ఘనీకి బుధవారం
న్యూఢిల్లీలో స్వాగతం పలుకుతున్న ప్రధాని మోదీ