జాతీయ వార్తలు

ఢిల్లీలో విమానం కూలి 10మంది దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 22: దేశ రాజధాని ఢిల్లీలోని ద్వారకా ప్రాంతంలో మంగళవారం ఉదయం బిఎస్‌ఎఫ్ విమానం కూలిపోయి 10 మంది దుర్మరణం చెందారు. సూపర్‌కింగ్ సంస్థకు చెందిన విమానం ఉదయం 9.50 గంటల ప్రాంతంలో విమానాశ్రయ ప్రహరీగోడను బలంగా ఢీకొంది. సాంకేతిక నిపుణులతో విమానం రాంచీ వెళ్లడానికి టేకాఫ్ అయిన కొద్ది సేపటికే కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అధికారులు, ముగ్గురు సాంకేతిక నిపుణులు మృతి చెందారు. జంట ఇంజన్ల చిన్న విమానం ముందు విమానాశ్రయం ప్రహరీ గోడను ఢీకొట్టి మురుగునీరు శుద్ధి కేంద్రం వద్ద కుప్పకూలిపోయింది. టేకాఫ్ అయిన ఐదు నిముషాల్లోనే ఈ ఘోరం జరిగిపోయింది. సరిగ్గా 9.50 గంటలకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో విమానానికి సంబంధాలు తెగిపోయినట్టు అధికారులు వెల్లడించారు. ప్రమాదంలో ఇద్దరు పైలెట్లు కూడా మృతి చెందారు. ఇది అత్యంత దురదృష్టకరమైందని కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మహేష్ శర్మ అన్నారు. దీనిపై దర్యాప్తునకు ఆదేశించామని, నివేదిక వచ్చాకే ప్రమాదానికి గల కారణాలు వెల్లడవుతాయని మంత్రి అన్నారు. రాంచీలో చెడిపోయిన హెలీకాప్టర్‌కు మరమ్మతు చేయడానికి సాంకేతిక నిపుణులను తీసుకెళ్తుండగా ఈ దారుణం చోటుచేసుకుందని తెలిపారు. కాగా ఈ ప్రమాదం నేపథ్యంలో ఢాకాలో జరగాల్సి ఉన్న భారత్, బంగ్లాదేశ్ డిజి స్థాయి చర్చలు రద్దుయ్యాయి. సంఘటనా స్థలం నుంచి ఆరు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్టు బిఎస్‌ఎఫ్ వర్గాలు తెలిపాయి. విమాన ప్రమాదం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విమానం మంటలు ఎగచిమ్ముతూ గిరిగిరా తిరుగుతూ నేల కూలిందని, ఆ సమయంలో అక్కడ పనిచేస్తున్న కార్మికుడు గాయపడ్డాడని ప్రత్యక్ష సాక్షి సూరజ్ తెలిపాడు. సంఘటన స్థలంలో దట్టమైన పొగ వ్యాపించింది. విమానం తునాతునకలైపోయింది. 15 అగ్నిమాపక శకటాలు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేసినట్టు ఢిల్లీ అగ్నిమాపక అధికారి ఎకె శర్మ చెప్పారు. ఎస్‌ఐబిలో సెకండ్ ఇన్ కమాండెంట్ అధికారి హోదాగల పైలెట్, డిప్యూటీ కమాండెంట్ హోదా ఉన్న కో- పైలెట్, ఆరుగురు సాంకేతిక నిపుణులు, ఒక ఇంజనీర్, ఒక ఉద్యోగి మృతి చెందారని పౌర విమానయాన శాఖ కార్యదర్శి ఆర్‌ఎన్ ఛౌబే తెలిపారు.
chitram...
ఢిల్లీలోని ద్వారకా ప్రాంతంలో మంగళవారం ఉదయం కూలిపోయిన బిఎస్‌ఎఫ్ విమానం

కూలిపోయన విమాన శకలాల్ని తొలగిస్తున్న సిబ్బంది