జాతీయ వార్తలు

గోవిందాచామి మరణశిక్ష రద్దు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: ఇరవై మూడేళ్ల సౌమ్యపై జరిగిన అత్యాచారం, హత్య కేసులో నిందితుడు గోవిందాచామికి విధించిన మరణశిక్షను సుప్రీం కోర్టు రద్దు చేస్తూ ఏడేళ్ల కారాగార శిక్ష ఖరారు చేసింది. జస్టిస్ రంజన్ గొగోయ్, పిసి పంత్, యుయు లలిత్‌తో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం ఐసిసిలోని 376,394,325 సెక్షన్లను సమర్ధిస్తూ గురువారం తీర్పును వెలువరించింది. 2011 ఫిబ్రవరి 1న జరిగిన ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కోచీ షాపింగ్ మాల్‌లో పనిచేస్తే 23 ఏళ్ల సౌమ్య ఏర్నాకులం-షోహ్రాన్‌పూర్ ప్యాసింజర్ రైల్‌లో ప్రయాణిస్తోంది. లేడీస్ బోగీలోనే ఆమె ప్రయాణిస్తోంది. గోవిందాచామి అనేవాడు లేడీస్ బోగీలో ఎక్కి ఆమెను రకరకాలుగా వేధింపులకు గురిచేశాడు. రైలు నడుస్తుండగానే సౌమ్యను కింద తోసేసి అతడూ దూకేశాడు. యువతి వల్లాతోల్ నగర్ చెట్ల పొదల వద్ద రైలు పట్టాలపై పడి తీవ్రంగా గాయపడింది. అయితే గోవిందాచామి అనే మానవ మృగం ఆమెను వదలిపెట్టలేదు. సౌమ్యపై అత్యాచారం చేశాడు. తీవ్రంగా గాయపడ్డ ఆమెను త్రిసూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఫిబ్రవరి 6న కన్నుమూసింది. గోవిందాచామి గతంలో ఎంతో నేరచరిత్ర ఉంది. సొంత ఊర్లో ఎనిమిది కేసులున్నట్టు ప్రాసిక్యూషన్ నిర్థారించింది. కేసును విచారించిన ఫాస్ట్‌ట్రాక్ కోర్టు 2012లో గోవిందాచామికి మరణశిక్ష విధించింది. ఫాస్ట్‌ట్రాక్ కోర్టును కేరళ హైకోర్టు సమర్ధించింది. రెండేళ్ల తరువాత గోవిందాచామి హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేశాడు. కేసు విచారించిన సుప్రీం కోర్టు కింద కోర్టులు తీర్పును కొట్టివేసింది. మరణశిక్షను రద్దు చేస్తూ నిందితుడికి ఏడేళ్ల శిక్షను ఖరారు చేసింది.