జాతీయ వార్తలు

కన్నడిగులకు భద్రత కల్పించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, సెప్టెంబర్ 15: కావేరీ జలాల వివాదంతో శుక్రవారం తమిళనాడు బంద్ జరుగుతున్నందున అక్కడున్న కన్నడవాసులకు భద్రత కల్పించాలని ముఖ్యమంత్రి జయలలితకు కర్నాటక సిఎం సిద్దరామయ్య విజ్ఞప్తి చేశారు. కన్నడ ప్రజల ఆస్తులు, ప్రాణాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు జయలలితకు గురువారం ఆయనో లేఖ రాశారు.‘కావేరి జలాల వివాదాన్ని ఆసరా చేసుకుని కొన్ని సంస్థలు బంద్‌కు పిలుపునివ్వడం శోచనీయం. ఈ అంశంపై ఇరు రాష్ట్రాలు చర్చించుకుని పరిష్కారం కనుగొనేందుకు మీరు సుముఖత వ్యక్తం చేశారు. అయినా కొన్ని తమిళ సంఘాలు బంద్‌కు పిలుపుఇవ్వడం బాధాకరం’అని ఆ లేఖలో సిద్దరామయ్య పేర్కొన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రికి రాసిన లేఖప్రతిని ఆయన ఈ మీడియాకు విడుదల చేశారు.‘తమిళనాడు రాష్ట్రంలో ఉంటున్న కన్నడ ప్రజలకు భద్రత కల్పించండి. బంద్ సందర్భంగా వారి ఆస్తులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోండి’అని ఆయన విజ్ఞప్తి చేశారు. కాగా కావేరీ జలాల అంశంపై మీడియా ఆచీతూచీ వ్యవహరించాలని, బాధ్యతాయుతంగా ఉండాలని ఆయన సూచించారు. కర్నాటకలో తమిళులపై జరిగిన దాడులకు నిరసనగా రైతు, వ్యాపార సంస్థలు శుక్రవారం తమిళనాడు బంద్‌కు పిలుపునిచ్చాయి. తమిళనాడు ప్రతిపక్ష పార్టీ డిఎంకె, ఎండిఎంకె, పిఎంకె,సిపిఐ,సిపిఎంలు బంద్‌కు మద్దతు ప్రకటించాయి. తమిళనాడులో కన్నడిగుల ఆస్తులపై దాడులకు నిరసనగా సోమవారం బెంగళూరు అట్టుడికిపోయింది. తమిళనాడు నెంబర్ ప్లేట్లు ఉన్న వాహనాలకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు.