జాతీయ వార్తలు

ములాయం పార్టీలో ముసలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, సెప్టెంబర్ 15: ఉత్తరప్రదేశ్ అధికార సమాజ్‌వాది పార్టీలో రెండు రోజుల క్రితం తలెత్తిన విభేదాలు మరింత ముదిరే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ విభేదాలు చివరికి పార్టీ అధినేత ములాయం సింగ్, కుమారుడు, ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌ల మధ్య విభేదాలకు దారితీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రెండు రోజుల క్రితం ములాయం సింగ్ ఉత్తరప్రదేశ్ సమాజ్‌వాది పార్టీ అధ్యక్ష పదవినుంచి అఖిలేష్ యాదవ్‌ను తప్పించి ఆయన స్థానంలో తన సోదరుడు శివపాల్ యాదవ్‌ను నియమించడంతో ఈ గొడవ మొదలైంది. దీనికి ప్రతిగా అఖిలేష్ యాదవ్ బాబాయి శివపాల్ సింగ్‌ను కీలక మంత్రిత్వ శాఖలనుంచి తప్పించడమే కాకుండా ఇద్దరు మంత్రులను తొలగించారు.
అఖిలేష్ చర్యతో కినుక వహించిన శివపాల్ బుధవారం హుటాహుటిన ఢిల్లీ వెళ్లి సోదరుడు ములాయం సింగ్‌ను కలవడమే కాకుండా మంత్రివర్గంలో తన స్థానాన్ని తగ్గించిన అఖిలేష్ నేతృత్వంలో తాను పని చేయలేనని కరాఖండిగా చెప్పారు. దీంతో సంక్షోభ పరిష్కారానికి ములాయం సింగ్ శుక్రవారం పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశం ఏర్పాటు చేశారు. కాగా, ఈ పరిణామాలపై బుధవారం లక్నోలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన అఖిలేష్ యాదవ్ తమ కుటుంబంలో, పార్టీ వ్యవహారాల్లో బయటివారు జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించారు. అంతేకాదు ఇది కుటుంబ పోరు కాదని కూడా ఆయన స్పష్టం చేశారు.
‘ యే ఘర్‌కీ లడా రుూ నహీహై, యే సర్కార్‌కీ లడారుూ హై’( ఇది కుటుంబ వివాదం కాదు, ప్రభుత్వంలో కొట్లాట) అని అఖిలేష్ అన్నారు. అంతేకా దు, కుటుంబ వ్యవహారాల్లో బయటి వారు జోక్యం చేసుకుంటే ఎలా సహిస్తామని ప్రశ్నించిన ఆయన ప్రతి ఒక్కరూ నేతాజీ (ములాయం) మాట వింటున్నారని కూడా చెప్పారు.
కాగా, అఖిలేష్ వ్యాఖ్యలపై స్పం దించిన పార్టీ రాజ్యసభ సభ్యుడు, ఒకప్పుడు ములాయంకు సన్నిహితుడైన అమర్ సింగ్ స్పందిస్తూ, అఖిలేష్ అంటున్న బయ టి వ్యక్తిని తాను కాదన్నారు. అధికార పార్టీ లో పరిణామాలపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మీర్జాపూర్‌లో జరిగిన సభ లో మాట్లాడుతూ సైకిల్ ( సమాజ్‌వాది పార్టీ గుర్తు) టైర్ పంక్చరయిందని, ఇప్పుడు అఖిలేష్ చక్రం విసిరేశాడని వ్యంగ్యంగా అన్నారు.