జాతీయ వార్తలు

హోల్‌సేల్‌గా జంప్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈటానగర్, సెప్టెంబర్ 16: దేశ ప్రజాస్వామ్య చరిత్రలోనే ఇదో సంచలన పరిణామం! ఆయారామ్ గయారామ్ నాటి రోజులను గుర్తుకు తెచ్చె ఉదంతం.. సాక్షాత్తు ఓ రాష్ట్ర ముఖ్యమంత్రే 42మంది ఎమ్మెల్యేలతో మరో ప్రాంతీయ పార్టీలోకి ఫిరాయించడమే కాకుండా అందులో విలీనమైపోవడం ఇటీవలి కాలంలో ఎన్నడూ జరగని విడ్డూరం. రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి పేమా ఖందూ ఏకంగా 43మంది ఎమ్మెల్యేలతో కలిసి బిజెపికి మిత్రపక్షమైన అరుణాచల్ పీపుల్స్ పార్టీలో చేరిపోయారు. రెండు నెలల క్రితమే అత్యంత వివాదాస్పద పరిస్థితుల్లో, అదీ సుప్రీం కోర్టు జోక్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. ఇంతలోనే ప్రభుత్వాన్ని కోల్పోవాల్సి రావడంతో కాంగ్రెస్ నాయకత్వం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఎమ్మెల్యే నబం తుకి మినహా ఎమ్మెల్యే అందరూ ముఖ్యమంత్రితో కలిసి కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పారు. కాగా, మొత్తం 42మంది ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి ఖందూ అసెంబ్లీ స్పీకర్ టెన్‌జింగ్ నోర్బూ ధోంగ్‌ధక్ ముందు హాజరు పరిచారు. వీరందరూ అరుణాచల్ పీపుల్స్ పార్టీలో చేరిపోవడాన్ని స్పీకర్ ఆమోదించారని అసెంబ్లీ వర్గాలు తెలిపాయి. 2014లో పిపిఏగా పేర్కొనే ఈ పార్టీ కాంగ్రెస్‌లో చేరింది. ఈ పార్టీకి ప్రస్తుత అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలు ఐదుగురు. తాజా విలీనాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్నది ఎన్డీయే ప్రభుత్వమే అవుతుందని ఈశాన్య అభివృద్ధి కూటమి (నెడా) కన్వీనర్, అసోం మంత్రి హిమంత బిస్వా సర్మా తెలిపారు. పదకొండు మంది ఎమ్మెల్యేలు కలిగిన బిజెపికి నెడాలో బలమైన ప్రభావం ఉంది. మరోసారి అరుణాచల్ ప్రభుత్వాన్ని కోల్పోవడంతో ఈశాన్య భారతంలో కాంగ్రెస్‌కు మణిపూర్, మేఘాలయ, మిజోరం రాష్ట్రాలే మిగిలాయి.
1980దశకంలో కేంద్రంలో ఇందిరా గాంధీ మళ్లీ అధికారంలోకి రావడంతో అప్పట్లో హర్యానాలో జనతా పార్టీ ప్రభుత్వానికి సారథ్యం వహించిన భజన్‌లాల్ మొత్తం ఎమ్మెల్యేలతో కలిసి కాంగ్రెస్‌లో చేరిపోయిన విషయం ఈ సందర్భంగా గమనార్హం.
కాగా, అరుణాచల్‌లో ఏర్పడ్డ తాజా ప్రభుత్వం బిజెపి అక్రమార్జితమేనని కాంగ్రెస్ ధ్వజమెత్తింది. ఈ సంఘటనతో ప్రజాస్వామ్యానికి మరోసారి తీవ్ర విఘాతం కలిగిందని తీవ్ర స్వరంతో విరుచుకు పడింది. ఒక్కరు మినహా మొత్తం కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో తాను అరుణాచల్ పీపుల్స్ పార్టీలోకి ఫిరాయించడాన్ని ముఖ్యమంత్రి ఖందు సమర్థించుకున్నారు. రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. ఏ విధంగానూ వనరుల బలం లేని అరుణాచల్ ప్రదేశ్ అన్ని విధాలుగా కేంద్రంపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని, రాజకీయ విభేదాలుంటే కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోవడం సాధ్యం కాదని విలేఖరుల సమావేశంలో ఖందూ పేర్కొన్నారు.

చిత్రం... అరుణాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి పేమా ఖందూ