జాతీయ వార్తలు

కీర్తి ఆజాద్ సస్పెన్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 23: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఢిల్లీ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అవినీతికి పాల్పడ్డారంటూ బహిరంగ ఆరోపణలు చేసిన పార్టీ ఎంపీ కీర్తి ఆజాద్‌ను బిజెపి సస్పెండ్ చేసింది. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగిసిన రోజే కీర్తి ఆజాద్‌ను బిజెపి అధినాయకత్వం పార్టీ నుంచి సస్పెండ్ చేయటం గమనార్హం. ఆమ్ ఆద్మీ పార్టీతోపాటు బిజెపి ఎంపీ కీర్తి ఆజాద్ చేసిన ఆరోపణల మూలంగా కాంగ్రెస్ మూడు నాలుగు రోజుల పాటు ఉభయ సభలను స్తంభింపజేయటం తెలిసిందే. జైట్లీపై ఆరోపణలు చేసేందుకు కీర్తి ఆజాద్ మీడియా సమావేశం ఏర్పాటు చేయటం తెలుసుకుని బిజెపి అధ్యక్షుడు అమిత్ షా రంగంలోకి దిగటం తెలిసిందే. జైట్లీపై ఆరోపణలు చేయకూడదని ఆదేశించారు. అయితే కీర్తి ఆజాద్ ముందు నిర్ణయించిన ప్రకారం మీడియా సమావేశం ఏర్పాటుచేసి ఆరోపణలు చేశారు. దీంతో మండిపడిన పార్టీ బుధవారం పార్లమెంటు సమావేశాలు ముగిసిన వెంటనే ఆయనను సస్పెండ్ చేసింది.