జాతీయ వార్తలు

తమిళనాడు బంద్ పాక్షికం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, సెప్టెంబర్ 16: కావేరి జలాల వివాదంపై తమిళనాడులో రైతులు, వ్యాపారులు ఇచ్చిన పిలుపుమేరకు శుక్రవారం బంద్ పాక్షికంగా జరిగింది. ప్రతిపక్ష డిఎంకె ఈ బంద్‌కు మద్దతిచ్చింది. బంద్‌కు మద్దతుగా ఆందోళనకు దిగిన డిఎంకె నాయకులు ఎం.కె.స్టాలిన్, కనిమోళి తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా, కావేరి జలాల వివాదంపై గురువారం తనకు తాను నిప్పంటించుకున్న ఒక యువకుడు కాలిన గాయాలతో శుక్రవారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. నామ్ తమిఝర్ కచ్చికి చెందిన కార్యకర్త 90 శాతం కాలిన గాయాలతో శుక్రవారం ఉదయం మృతి చెందాడు. అతని ప్రాణాలను కాపాడటానికి తాము అన్ని విధాలుగా చికిత్స అందించామని, కాని, గుండె సంబంధిత సమస్య ఏర్పడి అతను మృతి చెందాడని ఆసుపత్రికి చెందిన సీనియర్ అధికారులు తెలిపారు. కోయంబత్తూరు, తిరుపూర్, నీల్‌గిరీ జిల్లాల్లోని అనేక షాపులు, కార్యాలయాలు మూసివేసి ఉన్నాయి. సాధారణ జనజీవనం స్తంభించింది. నగరం, దాని చుట్టుపక్కల గల 20వేల చిన్న, మధ్య తరహా యూనిట్లు, బట్టల పరిశ్రమ కేంద్రమైన తిరుపూర్‌లో గల 30వేల వస్త్ర కర్మాగారాలను రాష్ట్ర బంద్‌కు మద్దతుగా మూసివేశారు.
చెన్నైలో డిఎంకె నేత స్టాలిన్ నేతృత్వంలో రాజారతినం స్టేడియం నుంచి ఎగ్మోర్ రైల్వే స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. స్టాలిన్ తన వందలాది మంది మద్దతుదారులతో కలిసి రైల్ రోకో నిర్వహించడానికి ప్రయత్నించగా, పోలీసులు దానిని భగ్నం చేశారు. స్టాలిన్‌ను, అతని మద్దతుదారులను అదుపులోకి తీసుకున్నారు. డిఎంకె పార్టీ కార్యకర్తలతో కలిసి రాస్తారోకోకు దిగిన డిఎంకె రాజ్యసభ సభ్యురాలు కనిమోళిని కూడా పోలీసులు నిర్బంధించారు. కావేరి వివాదంపై అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని కనిమోళి తమిళనాడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కోయంబత్తూరులో రైల్ రోకో నిర్వహించడానికి యత్నించిన డిఎంకె, ఎండిఎంకె తదితర పార్టీల నాయకులు, కార్యకర్తలను, రైతులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు మాత్రం యథావిధిగా పనిచేశాయి.