జాతీయ వార్తలు

సమగ్ర నివేదిక ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: దేశ రాజధాని ఢిల్లీలో డెంగ్యూ, చికున్‌గునియా విజృంభణపై కేంద్రం స్పందించింది. తక్షణ వ్యాధి నివారణ, పూర్తి వివరాలు ఇవ్వాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని శుక్రవారం ఆదేశించింది. రాజధానిలో ఇప్పటి వరకూ డెంగ్యూతో 30 మంది మృతి చెందారు. మూడువేల మందికి వ్యాధితో బాధపడుతున్నారు. కేంద్ర ఆరోగ్య మంత్రి జెపి నడ్డా గురువారం ఢిల్లీ వైద్య మంత్రి సత్యేంద్ర జైన్‌తో సమావేశమై డెంగ్యూ, చికున్ గునియాపై సమీక్షించారు. వ్యాధి నివారణకు కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని నడ్డా హామీ ఇచ్చారు. రోగ నివారణకు చర్యలు తీసుకోవాలని, వైద్యులు, మందులు అందుబాటులో ఉంచాలని ఆయన ఆదేశించారు. వ్యాధి సోకిన హర్యానా, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలకు కూడా పూర్తి సహకారం అందించనున్నట్టు నడ్డా చెప్పారు.‘ డెంగ్యూ, చికున్ గునియా సోకి ఎంత మంది చనిపోయిందీ వివరాలు అడిగాం. వ్యాధి నివారణకు తీసుకున్న చర్యలపై నివేదిక కోరాం. రోగుల బాగోగులు, వారి ఆరోగ్య పర్థితిపై సమగ్రంగా వివరించాలి’అని ఢిల్లీ సర్కార్‌ను కోరినట్టు నడ్డా వెల్లడించారు. ప్రాధమిక సమాచారం ప్రకారం ఇప్పటివరకూ 30 మంది మృతి చెందారని, 2,800 మంది వ్యాధితో బాధపడుతున్నారని మంత్రి పేర్కొన్నారు. పొరుగు రాష్ట్రాలైన హర్యానా, యూపీ ప్రభుత్వాలతో కేంద్ర అధికారులు మాట్లాడారని మంత్రి తెలిపారు. నిత్యం వారితో సంప్రదింపులు జరుపుతున్నామని, వ్యాధి వ్యాపించకుండా చర్యలు తీసుకోవడంతో పాటు రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు నడ్డా స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఆసుపత్రల్లో ప్రత్యేక క్లినిక్‌లు ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. యూపీలో 12 మంది చికున్ గునియా రోగుల్లో ఇద్దరు ఘజియాబాద్ వాసులని మంత్రి పేర్కొన్నారు. అలాగే ఢిల్లీలో ఐదుగురికి చికున్ గునియా సోకిందని నడ్డా చెప్పారు. వ్యాధిసోకి ఆసుపత్రిలో చేరిన రోగి ఒక్కరు కూడా పూర్తిగా నయం కాకుండా ఇంటికి వెళ్లకూడదని మంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వైద్యుల కొరత, పారామెడికల్ సిబ్బంది. ఔషధాలు, టెస్టింగ్ కిట్‌లు, లాబొరెటరీ సదుపాయం అందుబాటులో ఉంచినట్టు కేంద్ర మం త్రి తెలిపారు.

ఢిల్లీలో రేపిస్ట్ అరెస్టు
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: పెళ్లి చేసుకుంటానని నమ్మించి, పలుసార్లు అత్యాచారం చేసిన యువకుడిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చే శారు. రెండేళ్లపాటు లైంగిక దాడి చేయడమే కాకుండా అభ్యంతరకరమైన ఎంఎంఎస్‌లు ఆమెకు పంపేవాడు. పైగా 25 వేల రూపాయలు ఇవ్వకపోతే బయటపెడతానని బెదిరింపులకు పాల్పడడం తో 22 ఏళ్ల యువతి పోలీసులను ఆశ్రయించింది. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు 20 ఏళ్ల రోహిత్ కోహ్లీని అరెస్టు చేశారు. రోహిత్ 2014 అక్టోబర్ నుంచి 2016 జూన్ వరకూ అనేక సార్లు అత్యాచారం చేశాడు. యువతి నుంచే రోహిత్ సొమ్ములు గుంజేవాడని సీనియర్ పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు.

జిఎస్‌టి కౌన్సిల్ ఏర్పాటు
నోటిఫికేషన్
జారీ చేసిన కేంద్రం

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: కేంద్ర ప్రభుత్వం శుక్రవారం వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) కౌన్సిల్‌ను ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ కౌన్సిల్ ఎంత శాతం జిఎస్‌టిని విధించాలనే అంశం తో పాటు ఈ పన్ను పరిధిలోకి రాకుండా మినహాయించే వస్తువులను కూడా నిర్ణయిస్తుంది. కేంద్ర ఆర్థిక మంత్రి ఈ కౌన్సిల్‌కు చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ప్రతి రాష్ట్రం నుంచి ఒక్కో మంత్రి ఈ కౌన్సిల్‌లో సభ్యులుగా ఉంటారు. రాష్ట్ర ఆర్థిక లేదా టాక్సేషన్ లేదా ఆ రాష్ట్ర ప్రభుత్వం నియమించే ఏ శాఖ మంత్రి అయినా ఇందులో సభ్యులుగా ఉంటారు.
వీరితో పాటు కేంద్ర రెవెన్యూ లేదా ఆర్థిక శాఖ సహాయ మంత్రి కూడా సభ్యులుగా ఉంటారు. ‘రాజ్యాంగంలోని అధికరణం కింద తనకు సంక్రమించిన అధికారాలతో రాష్టప్రతి వస్తు, సేవల పన్ను కౌన్సిల్‌ను ఏర్పాటు చేశారు’ అని ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ పేర్కొంది.