జాతీయ వార్తలు

జనహితంగా రాజ్యాంగం అమలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: నేపాల్‌లో అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలకు స్థా నం కల్పించడం ద్వారా కొత్త రాజ్యాంగాన్ని అమలు చేయాలని భారత్ పిలుపునిచ్చింది. అంతేకాకుండా ఆ దేశానికి అన్ని విధాలా సాయం అందిస్తామని కూడా హామీ ఇచ్చింది. మన దేశంలో మూడు రోజుల పర్యటన కోసం వచ్చిన నేపాల్ ప్రధానమంత్రి పుష్పకుమార్ దహల్ (ప్రచండ)తో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఇక్కడ విస్తృతమైన, నిర్మాణాత్మక చర్చలు జరిపారు. చర్చల అనంతరం ఇరు పక్షాలు మూడు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. నేపాల్‌లో భారీ భూకంపం అనంతరం చేపట్టిన పునర్నిర్మాణ కార్యక్రమాల కోసం 15 కోట్ల డాలర్ల సాయం అందించడానికి సం బంధించిన ఒప్పందం కూడా ఇందులో ఉంది. రెండోసారి నేపాల్ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రచండ భారత్‌లో పర్యటించడం ఇదే మొదటిసారి. కొత్త రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాధేషీల ఆందోళనల కారణంగా చెలరేగిన రాజకీయ సంక్షోభంతో గత జూలైలో కెపి శర్మ ఓలి ప్రధాని పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
రక్షణ, భద్రత రంగాల్లో సహకారాన్ని కొనసాగించాలని కూడా రెండు దేశాలు నిర్ణయించాయి. భిన్న సం స్కృతులకు నిలయమైన దేశంలో అన్ని వర్గాల ఆకాంక్షలకు చోటు క ల్పించడం ద్వారా కొత్త రాజ్యాంగాన్ని అమలు చేయడంలో నేపాల్ విజయవంతమవుతుందన్న ఆకాంక్షను ప్రచండతో చర్చల అనంతరం విడుదల చేసిన ప్రకటనలోనరేంద్ర మోదీ వ్యక్తం చేశారు. పొరుగు దేశాలుగా, అలాగే సన్నిహిత మిత్ర దేశాలుగా నేపాల్ శాంతి, సుస్థిరత, సమృద్ధి తమ రెండుదేశాల ఉమ్మడి లక్ష్యమని ప్రచండ సమక్షంలో ప్రధాని మోదీ చెప్పారు. కాగా, భారత్ పట్ల తమకు ప్రేమ తప్ప మరోటి లేదని, ఇరు దేశాల భవిష్యత్తులు ఒకదానితో మరోటి ముడి పడి ఉన్నాయని తన వంతుగా ప్రచండ చెప్పారు. నేపాల్ అభివృద్ధి పయనం, ఆర్థిక ప్రగతి ప్రతి అడుగులోను భాగస్వామి కావడం భారత్ చేసుకున్న అదృష్టమని మోదీ చెప్పారు. మన స్నేహం కాలపరీక్షలకు తట్టుకుని నిలబడిందని, ప్రత్యేకమైనదని ఆయన అంటూ, మనం ఒకరి విజయాలకు మరొకరు ఎలా సంతోషిస్తామో అలాగే ఒకరి కష్టాలను మరొకరు పంచుకున్నాం అని అన్నారు.
నేపాల్‌లో భారత్ అమలు చేస్తున్న అభివృద్ధి ప్రాజెక్టులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సకాలంలో పూర్తి చేయడంపై దృష్టి పెట్టడానికి ఇరు పక్షాలు అంగీకరించాయని మోదీ చెప్పారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న జలవిద్యుత్ ప్రాజెక్టులను సత్వరం పూర్తయ్యేలా చూస్తామని కూడా ఆయన చెప్పారు. నేపాల్‌కు సుస్థిరతను తీసుకు రావడానికి కృషి చేస్తున్న ప్రచండను మోదీ ప్రశంసించారు. ‘మీ నాయకత్వంలో నేపాల్ అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలకు స్థానం కల్పిస్తూ రాజ్యాంగాన్ని విజయవంతంగా అమ లు చేస్తుందన్న గట్టి నమ్మకం నాకు ఉంది’ అని ఆయన చెప్పారు. నేపాల్‌లో అభివృద్ధి భాగస్వామ్యాన్ని మరింత మలోపేతం చేసుకోవడానికి భారత్ సిద్ధంగా ఉందని, నేపాల్, ప్రజలు, ప్రభుత్వ ప్రాధాన్యతల ప్రకా రం ఆ పని చేస్తామని తాను ప్రచండకు హామీ ఇచ్చినట్లు కూడా ఆయన చెప్పారు. రాజ్యాంగంలోని నిబంధనలను అమలు చేసేటప్పుడు అన్ని వర్గాల ప్రజలను విశ్వాసంలోకి తీసుకోవడానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని ప్రచండ తెలిపారు.

chitram...
ఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్‌లో సంయుక్త ప్రకటన
సందర్భంగా మాట్లాడుతున్న ప్రధాని మోదీ, నేపాల్ ప్రధాని ప్రచండ
భారత రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీతో
ప్రధాని ప్రచండ చర్చలు జరుపుతున్న దృశ్యం