జాతీయ వార్తలు

దీన జనోద్ధరణే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాంధీనగర్/లింఖేడ, సెప్టెంబర్ 17: ప్రధాని నరేంద్ర మోదీ 66 జన్మదినోత్సవం సందర్భంగా తల్లి హీరాబెన్ కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. శనివారం ఆయన గాంధీనగర్ వచ్చి మాతృమూర్తిని కలిశారు. గాంధీనగర్‌లోని రేసాన్ ప్రాంతంలో మోదీ సోదరుడు పంజక్ మోదీతో కలిసి ఆమె ఉంటున్నారు. గిరిజనులు, దివ్యాంగుల మధ్య జన్మదినోత్సవం జరుపుకొన్నారు. దివ్యాంగులకు మూడు చక్రాల సైకిళ్లను ప్రధాని పంపిణీ చేశారు.
గిరిజనులు, బలహీన వర్గాల ఉద్ధరణే తన లక్ష్యమని ప్రధాని మోదీ ప్రకటించారు. కాగా ప్రధాని మోదీకి రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్టప్రతి హమీద్ అన్సారీ, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తదితరులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తల్లి దగ్గరకు వచ్చినప్పుడు మోదీ కాన్వాయ్ గానీ అధికారులను గానీ వెంట తీసుకురాకుండా ఒకే కారులో వచ్చారు. 25 నిముషాల సేపు తల్లి హీరాబెన్‌తో ముచ్చటించి, ఆమె ఇచ్చిన మిఠాయి తిన్న మోదీ తరువాత రాజ్‌భవన్‌కు వెళ్లారు. తరువాత దివ్యాంగులు, గిరిజనులతో ప్రధాని సమావేశమయ్యారు. భారత్ పర్యటనలో ఉన్న నేపాల్ ప్రధాని ప్రచండ ప్రధాని మోదీకి ఫోన్‌చేసి శుభాకాంక్షలు తెలిపారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్ రాజ్‌భవన్‌లో ప్రధానిని స్వయంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు చెప్పారని పిఎంఓ ఒక ప్రకటనలో పేర్కొంది. దేశ, విదేశాలకు చెందిన ఎందరో ప్రముఖులు మోదీకి శుభాకాంక్షలు తెలుపుతూ సందేశాలు పంపారు.కాగా దాహోద్ జిల్లా లింఖేడలో గిరిజనుల ర్యాలీలో పాల్గొన్న ప్రధాని పలు సంక్షేమ పథకాలు ప్రారంభించారు. గిరిజనుల అభ్యున్నతికి తమ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని ఆయన స్పష్టం చేశారు. దేశాభివృద్ధిలో గిరిజనులు పోషించిన పాత్రను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. స్వాతంత్య్ర పోరాటంలోనూ ముందున్నారని అన్నారు. 4,817కోట్ల రూపాయలతో గుజరాత్ ప్రభుత్వం చేపట్టిన మంచి నీటి పథకాన్ని ఆయన ప్రారంభించారు. కేంద్రంలో ఎన్‌డిఏ అధికారంలోకి వచ్చాకే గిరిజనులు, బలహీన వర్గాల సంక్షేమంకోసం అనేక పథకాలు చేపట్టి అమలు చేస్తోందన్నారు.

చిత్రం... గుజరాత్‌లోని లింఖేడలో శనివారం నిర్వహించిన గిరిజనుల ర్యాలీలో నరేంద్ర మోదీని గజమాలతో సత్కరిస్తున్న బిజెపి కార్యకకర్తలు