జాతీయ వార్తలు

పని పట్టాల్సిందే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: ఆక్రమిత కాశ్మీర్‌లోని మిలిటెంట్ స్థావరాలపై పరిమిత సైనిక దాడి జరపాలన్న డిమాండ్ల నేపథ్యంలో తదుపరి చర్యలపై భారత్ దృష్టి పెట్టింది. కాశ్మీర్‌లోని యూరీ సైనిక స్థావరంపై పాకిస్తాన్ మిలిటెంట్ సంస్థ జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో 17మంది భారత సైనికులు మృతి చెందిన నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. హోం మంత్రి రాజ్‌నాధ్ సింగ్, రక్షణ మంత్రి మనోహర్ పారికర్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో పాటు ఆర్పీ చీఫ్ దల్బీర్ సింగ్, ఇతర సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. యూరి దాడి అనంతరం కాశ్మీర్‌లో నెలకొన్న తాజా పరిస్థితుల గురించి ఈ సందర్భంగా మోదీకి వివరించారు. యూరి దాడి వెనుక ఉన్నవారిని వదిలి పెట్టేది లేదని, కచ్చితంగా దండించి తీరుతామని ప్రధాని మోదీ స్వయంగా ప్రకటించడంతో ఈ సమావేశానికి మరింతగా ప్రాధాన్యత పెరిగింది. భారత్‌ను లక్ష్యంగా చేసుకుని ఓ పరంపరగా విఘాతక కృత్యాలకు పాల్పడుతున్న పాకిస్తాన్‌ను ఏ విధంగా ఎదుర్కోవాలి? అందుకు తక్షణం అందుబాటులో ఉన్న మార్గాలేమిటన్నదానిపై ఈ ఉన్నతాధికార సమావేశంలో చర్చించారు. ముఖ్యంగా అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్తాన్ నిజ స్వరూపాన్ని ఎండగట్టడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగాలని భారత్ భావిస్తోంది. దౌత్యపరంగా పాక్‌ను ఏకాకిని చేయడం, అలాగే యూరీ దాడి సందర్భంగా మిలిటెంట్ల వద్ద లభించిన పాక్ ముద్రలున్న వస్తువులను, ఆయుధాలు, ఆహార పొట్లాలు, ఎనర్జీ పానీయాలు, జిపిఎస్ ట్రాకర్లను పాకిస్తాన్‌కు అందించం ద్వారా పాక్‌ను నిలదీయాలని భావిస్తోంది. అయితే ఎలాంటి తొందరపాటు లేకుండా స్పష్టమైన వ్యూహంతో, అంచెలంచెలుగా పాక్‌ను అంతర్జాతీయ సమాజం ముందు దౌత్యపరంగా ఏకాకిని చేసే ఆలోచనకు పదును పెడుతోంది. ఈ సమావేశంలో పాల్గొన్న కేంద్ర మంత్రులు, ఇతర ఉన్నతాధికారులు పాకిస్తాన్‌ను దండించే విషయంలో ఇంకెంత మాత్రం జాప్యం జరగడానికి వీల్లేదన్న అభిప్రాయం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న ఐరాస జనరల్ అసెంబ్లీనే ఇందుకు వేదిక చేసుకోవాలన్న ఆలోచన కూడా ఈ సమావేశంలో పరిశీలనకు వచ్చినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా హోం మంత్రి రాజ్‌నాథ్, రక్షణ మంత్రి మనోహర్ పారికర్‌లు భద్రతా దళాలకు చెందిన ఉన్నతాధికారులతో సమావేశమై కాశ్మీర్ పరిస్థితిని సమీక్షించారు. కాశ్మీర్‌తో పాటు ఆధీన రేఖ వద్ద నెలకొన్న తాజా పరిస్థితి గురించి కూడా హోం, రక్షణ మంత్రులకు ఆర్మీ అధికారులు వివరించారు. యూరి దాడి నేపథ్యంలో తలెత్తే తాజా సవాళ్లను ఎదుర్కొనేందుకు ఏ విధంగా ముందుకెళ్లాలన్న విషయాన్నీ ఈ సందర్భంగా పరిశీలించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. యూరి దాడి వెనుక పాక్ ఉగ్రవాద సంస్థల ప్రమేయాన్ని నిర్థారించే మరిన్ని బలమైన ఆధారాలను సేకరించేందుకు జాతీయ దర్యాప్తు ఏజెన్సీ (ఎన్‌ఐఎ) బృందం కాశ్మీర్ వెళ్లనుంది. ఇదిలా ఉండగా, యూరి దాడి దోషుల్ని, కుట్రదారుల్ని భారత్ వదిలి పెట్టేది లేదని, కఠినంగా దండించి తీరుతుందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. ఇంకెంత మాత్రం ఉగ్రవాద దాడుల్ని భారత్ ఉపేక్షించే ప్రసక్తి లేదని ఉద్ఘాటించారు.
ప్రణబ్‌కు వివరించిన మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీని కలుసుకుని యూరి దాడి, అనంతర పరిణామాలు, కాశ్మీర్‌లో నెలకొన్న తాజా పరిస్థితుల గురించి వివరించారు. సీనియర్ అధికారులతో సమావేశమైన కొన్ని గంటల వ్యవధిలోనే ప్రధాని నేరుగా రాష్టప్రతి భవన్‌కు వెళ్లి ప్రణబ్‌ను కలుసుకున్నారు.
chitram...
యూరి సైనిక స్థావరంపై ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో మంత్రులతో కూడిన ఉన్నతస్థాయ సమావేశంలో పరిస్థితి సమీక్షిస్తున్న మోదీ