జాతీయ వార్తలు

కొంతకాలం ఆగండి..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 23: అమెరికాలోని సాన్‌జోస్ పరిధిలోని సిలికాన్ వ్యాలీ వర్శిటీ, ఫ్రెమోంట్‌లోని నార్త్ వెస్ట్రన్ పాలిటెక్నిక్ వర్శిటీలో ఉన్నత చదువులకు వెళ్లాలనుకునే వారు తమ ప్రయాణాన్ని కొంతకాలం వాయిదా వేసుకోవాలని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి చేసింది. విదేశీ వ్యవహారాల శాఖ బుధవారం ఈమేరకు ప్రకటన విడుదల చేసింది. రెండు వర్శిటీల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు వీసాలు తీసుకొస్తున్న భారత విద్యార్థులను ఇటీవల విమానాశ్రయంలోనే బంధించి విచారణ జరిపిన అనంతరం తిరుగు విమానంలో వెనక్కి పంపేయటం తెలిసిందే. కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్ విద్యార్థులకు ఎదురవుతున్న సమస్యల గురించి అమెరికా ప్రభుత్వంతో చర్చిస్తున్నారనీ, చర్చలు కొలికొచ్చిన తరువాత ఇతర అంశాలను వెళ్లడిస్తారని ప్రకటనలో పేర్కొన్నారు. వీసా మంజూరు చేసిన తరువాత తమ దేశానికి వస్తున్న భారత విద్యార్థులను విమానాశ్రయం నుంచి వనక్కు పంపించివేయటంపై భారత ప్రభుత్వం అమెరికాకు తమ నిరసన తెలిపింది. కేంద్రం నిరసన వ్యక్తం చేయటంపై అమెలికా ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి వివరణా ఇవ్వలేదు. వివరణరాగానే అందరికీ వెల్లడిస్తామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఉభయ దేశాలకు ప్రయోజనకరం ఉండేలా చర్చలు జరుగుతున్నాయన్నారు. ప్రయాణ పత్రాలతోపాటు వారు అభ్యసించనున్న విద్యకు సంబంధించి అన్ని పత్రాలను తమవెంట తీసుకుపోవాలని విదేశీ వ్యవహారాల శాఖ విద్యార్థులకు హితవు చెప్పింది. ఇళ్లు, ఆర్థిక మద్దతు, ఆరోగ్య బీమాకు సంబంధించిన అన్ని పత్రాలు తీసుకుపోవాలని సూచించింది. అమెరికాకు వెళ్లిన తరువాత విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ అధికారులతో ఏం మాట్లాడాలి? ఎలా మాట్లాడాలనేది కూడా నేర్చుకోవాలని విదేశీ వ్యవహారాల శాఖ విద్యార్థులకు సూచించింది. అమెరికాలో తాము చేరాలనుకుంటున్న వర్శిటీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవాలి. ఆ వర్శిటీలకు గుర్తింపు ఉందా? లేదా? వర్శిటీల సామర్థ్యం ఏమిటి? అనేది కూడా విద్యార్థులు ముందే తెలుసుకోవాలని సూచించింది.