జాతీయ వార్తలు

లోతట్టు ప్రాంతాల ఎత్తు పెంచుతారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ సెప్టెంబర్ 19: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని లోతట్టు ప్రాంతాలను ఎత్తును పెంచుతున్నారా అని మరోసారి గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటి) ఏపి ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దానికి ప్రభుత్వ తరఫు న్యాయవాది అటువంటిది లేదని సమాధానం ఇస్తూ, తమ వాదనల సమయంలో వివరిస్తామని ట్రిబ్యునల్‌కు తెలిపారు. తదుపరి విచారణను సెప్టెంబర్ 30కి ఎన్జీటి వాయిదా వేసింది. నూతన రాజధాని అమరావతికి పర్యావరణ అనుమతులపై దాఖలైన పలు పిటిషన్లుపై ఎన్జీటి చైర్మన్ జస్టిస్ స్వతంత్ర కుమార్‌తోకూడిన త్రిసభ్య ట్రిబ్యునల్ సోమవారం నాడు విచారణ జరిపింది.
పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది సంజయ్ పారిఖ్ వాదనలు వినిపించారు. విచారణ సందర్భంగా ఎన్జీటి చైర్మన్ జస్టిస్ స్వతంత్రకుమార్ జోక్యం చేసుకొంటూ లోతట్టుగా ఉన్న ప్రాంతాన్ని ఎత్తు పెంచుతామనే ప్రతిపాదన ఉందా? అని ఏపి తరఫు న్యాయవాదిని ప్రశ్నించారు. దానికి ఏపి తరఫు న్యాయవాది ఏకె గంగూలీ లేదని చెప్తూ, మా వాదనల సమయంలో వివరిస్తామని చెప్పారు. దీనిపై పిటిషనర్ల తరఫున్యాయవాది సంజయ్ పారిఖ్ జోక్యం చేసుకొంటూ వారు ఇచ్చిన నివేదికలోనే ఆ విషయం ఉందని, రూ. 1500 కోట్లతో రెండు మీటర్ల మేర ఎత్తు పెంచుతున్నామని స్వయంగా సిఆర్‌డిఏ కమిషనర్ ఒక జాతీయ దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో తెలియజేశారని వెల్లడించారు.
గతంలో 2009లో వచ్చిన వరదల మూలంగా రాజధాని లోతట్టు ప్రాంతం ఉన్న తీరును, లంక ప్రాంతాలను, నష్టపోయిన తీరును పటం ద్వారా ట్రిబ్యునల్‌కి వివరించారు. ఈ సందర్భంగా జస్టిస్ స్వతంత్రకుమార్ జోక్యం చేసుకుని పర్యావరణ ప్రభావ అంచనా నివేదికకు, పర్యావరణ అనుమతి నివేదికకు తేడా ఉందా? అని ప్రశ్నించారు. దానికి పిటిషనర్ల తరఫు న్యాయవాది వివరిస్తూ చాలా తేడా ఉందని, అనేక ఆంక్షలను పర్యావరణ అనుమతిలో విధించారన్నారు. అయితే పర్యావరణ ప్రభావ అంచనా నివేదికతో పనిలేదని ట్రిబ్యునల్ పేర్కొంది. పారిఖ్ వాదనలు కొనసాగిస్తూ మరోవైపు కృష్ణానది మధ్య లంక ప్రాంతాలను ఖాళీ చేయించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని, వాణిజ్య ప్రాంతాలుగా మార్చాలని చూస్తోందని వాదించారు. నదీ ప్రవాహ గతిని మార్చితే మానవాళికి చాలా నష్టం జరుగుతుందన్నారు. పైగా రాజధాని ప్రాంతం భూకంప ముప్పు జోన్‌లో ఉందని వివరించారు దీనికి జస్టిస్ స్వతంత్ర కుమార్ స్పందిస్తూ ఇది చాలా తీవ్రంగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశం అని అన్నారు. లంక గ్రామాల్లోని ప్రజలు ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని నివసిస్తున్నారని ఏపి తరఫున్యాయవాది వెల్లడించారు. దాదాపు 2గంటల పాటు విచారణ జరగగా తదుపరి సెప్టెంబరు 30,అక్టోబరు 1 తేదీల్లో జరపనున్నట్టు ట్రీబ్యునల్ తెలియజేస్తూ విచారణను వాయిదా వేసింది.