జాతీయ వార్తలు

భారత్ ఆశ్రయం కోరుతా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జెనీవా/ న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: జమ్మూకాశ్మీర్‌లో భారత్ మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని అంతర్జాతీయ వేదికలపై ఆరోపిస్తున్న పాకిస్తాన్‌కు ఇది ఎదురుదెబ్బ. పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ రాష్ట్రానికి చెందిన నేత బ్రహుమ్‌దగ్ బుగ్తి భారతదేశ ఆశ్రయం కోరుతానని సోమవారం ప్రకటించారు. బాలోచ్ రిపబ్లికన్ పార్టీ (బిఆర్‌పి) అధినేత అయిన బుగ్తి పాకిస్తాన్‌లో తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉండటంతో కొన్ని సంవత్సరాలుగా విదేశాలలో ప్రవాస జీవితం గడుపుతున్నారు. జమ్మూకాశ్మీర్‌లోని యూరి సెక్టార్‌లో ఆదివారం సైనిక శిబిరంపై జరిగిన ఉగ్రవాద దాడిసహా తన భూభాగంపై జరుగుతున్న ఉగ్రవాద దాడుల్లో పాకిస్తాన్ హస్తం ఉందంటూ భారత్ ఎండగడుతున్న నేపథ్యంలో బుగ్తి తనకు ఆశ్రయం కల్పించాల్సిందిగా భారత్‌ను కోరాలని నిర్ణయించుకున్నానని సోమవారం ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదిలా ఉండగా, చైనాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ న్యాయస్థానంలో (ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్) కేసు వేయాలని బాలోచ్ రిపబ్లికన్ పార్టీ నిర్ణయించింది. తమకు సహాయం చేయవలసిందిగా భారత్, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్‌లను కోరాలని కూడా బిఆర్‌పి నిర్ణయించింది. ‘పాకిస్తాన్‌లోని బాలోచిస్తాన్‌లో గత ఆరేళ్లలో సుమారు వెయ్యి వరకు బుల్లెట్ గాయాలు అయిన మృతదేహాలు లభ్యమయ్యాయి’ అని బుగ్తి పేర్కొన్నారు. బుగ్తి తాత, బాలోచ్ నేషనలిస్ట్ నేత నవాబ్ అక్బర్ ఖాన్ బుగ్తి పదేళ్ల క్రితం పాకిస్తాన్ బలగాల చేతుల్లో హతమైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి బ్రహుమ్‌దగ్ బుగ్తి విదేశాలలో ప్రవాస జీవితం గడుపుతున్నారు. తనకు ఆశ్రయం కల్పించవలసిందిగా భారత ప్రభుత్వాన్ని కోరుతూ జెనీవాలో గల ఆ దేశ దౌత్య కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటానని బుగ్తి తెలిపారు. దీనికి సంబంధించిన న్యాయ ప్రక్రియను త్వరలోనే చేపడతామని ఆయన జెనీవాలో విలేఖరులకు చెప్పారు.