జాతీయ వార్తలు

బరితెగించిన మైనర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 23:దేశ రాజధాని నగరమైన ఢిల్లీలోని ఓ కోర్టు గదిలోనే సుపారీ హంతకులు బుధవారం సినిమా ఫక్కీలో తెగబడ్డారు. రెండు గ్యాంగుల మధ్య జరిగిన ఘర్షణలకు కోర్టు గదే కేంద్రమైంది. కోర్టుకు వస్తున్న తన ప్రత్యర్థిని హతమార్చేందుకు మరో ముఠా నాయకుడు ఈ మైనర్లను ఉపయోగించుకున్నాడు. ఢిల్లీలోని దక్షిణ్‌పురి, మదన్‌గిర్‌లకు చెందిన ఈ మైనర్లు జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ హెడ్‌కానిస్టేబుల్ మరణించాడు. ఆగంతకులు చంపాలనుకున్న ఖైదీ ఇర్ఫాన్ తీవ్రంగా గాయపడ్డాడు. ఇర్ఫాన్ అలియాస్ చైనీ పహల్వాన్ అనే ఓ ఖైదీని తూర్పు ఢిల్లీలోని కర్కర్‌డూమా కోర్టుకు ఉదయం 11గంటలకు తీసుకొచ్చిన సమయంలో ఈ ఘటన జరిగిందని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. కాంట్రాక్టు హంతకులు జరిపిన కాల్పుల్లో మరణించిన హెడ్ కానిస్టేబుల్‌ను రామ్ కన్వర్ మీనాగా గుర్తించామని, అతడికి ఏకంగా మూడు బులెట్లు తగిలాయని, అలాగే ఖైదీ ఇర్ఫాన్ అలియాస్ చైనీకి రెండు బులెట్లు తగిలాయని తెలిపారు. వీరిద్దరినీ వెంటనే ఆసుపత్రికి తరలించినా మీనా ప్రాణాలను కాపాడలేక పోయామన్నారు. ఈ సంఘటనపై హత్య, హత్యాయత్నం కేసు నమోదు డిసిపి బిఎస్ గుర్జార్ తెలిపారు. కాంట్రాక్టు కిల్లర్లు మొత్తం ఎనిమిది రౌండ్లు కాల్పులు జరిపారని, వీటిలో ఒకటి మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ సునీల్ గుప్తా కుర్చీని దూసుకు పోయిందని తెలిపారు. కాల్పులకు పాల్పడిన తర్వాత ఆగంతకులు పారిపోయేందుకు ప్రయత్నించడంతో అక్కడ ఉన్న లాయర్లు, భద్రతా సిబ్బంది వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వీరందరూ మైనర్లేనని, నగరంలోని యమునా ప్రాంతంలో హంతక ముఠా నడుపుతున్న నసీర్ అనే వ్యక్తే ఇర్ఫాన్‌ను హతమార్చేందుకు వీరిని నియమించినట్టుగా పోలీసులు తెలిపారు. తన ముఠా సభ్యులకే ఇర్ఫాన్‌ను హతమార్చే బాధ్యతను అప్పగించే అవకాశం ఉన్నా..మైనర్లకు ఈ పని చెప్పడం వల్ల చట్ట ప్రకారం వీరిపై ఎలాంటి చర్యకు ఆస్కారం ఉండదని నజీర్ భావించి ఉండవచ్చునని పోలీసులు తెలిపారు.