జాతీయ వార్తలు

కావేరీ తీర్పుపై తమిళనాడు హర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, సెప్టెంబర్ 20: కావేరీ వివాద పరిష్కారం కోసం నదీ జలాల యాజమాన్య బోర్డు(సిఎంబి)ను ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై తమిళనాడులో రైతులు, రాజకీయ పార్టీలు హర్షం వ్యక్తం చేశాయి. సుప్రీం తీర్పును గౌరవిస్తూ ఎంతమాత్రం ఆలస్యం చేయకుండా కావేరీ నదీ జలాల యాజమాన్య బోర్డును తక్షణం ఏర్పాటు చేయాలని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితతో పాటు, అన్ని రాజకీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ‘తమిళనాడు రైతులు చాలా సంతోషంతో ఉన్నారు. ఈ తీర్పును మన: స్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం’ అని తమిళనాడు అఖిల రైతు సమాఖ్యల అధ్యక్షుడు పి.ఆర్.పాండియన్ అన్నారు. అత్యున్నత న్యాయస్థానంలో న్యాయపరమైన చర్యలు సమర్థంగా తీసుకున్నందుకు ముఖ్యమంత్రి జయలలితకు కృతజ్ఞతలు చెప్తున్నానని ఆయన అన్నారు. కావేరీ జలాలపై ఏళ్ల తరబడి పోరాటం చేస్తున్న తమిళనాడు రైతులకు, రాజకీయ పార్టీలకు సుప్రీం తీర్పు ఊరట కలిగించిందన్నారు. ఇప్పుడు ఏర్పడబోయే బోర్డు రాజకీయాల ప్రమేయం లేకుండా రైతుల అవసరాల మేరకు నీటి కేటాయింపులు జరుపుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 27 వరకు రోజుకు ఆరువేల క్యూసెక్కుల నీరును విడుదల చేయాలనడం సరికాదని.. ఆ నీరు తమిళనాడుకు సరిపోదని, అయితే కావేరీ మేనేజిమెంట్ బోర్డు ఏర్పాటును మాత్రం స్వాగతిస్తున్నామని పిఎంకె చీఫ్ రాందాస్, అలిండియా నేషనల్ లీగ్ చీఫ్ ఎస్‌జె ఇనాయతుల్లా, ఎండిఎంకె చీఫ్ వైకో తదితర నేతలు అన్నారు.
సరిహద్దుల్లో సైన్యం జల్లెడ!

ఉగ్రవాదుల మృతదేహాల కోసం గాలింపు
ఆధీనరేఖ వద్ద పడిఉన్నట్టుగా గుర్తింపు

ఉరీ, సెప్టెంబర్ 21: కాశ్మీర్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఉగ్రవాదుల కోసం రెండోరోజు బుధవారం కూడా తీవ్ర స్థాయిలో సైనిక దళాలు గాలింపుజరిపాయి. మొత్తం 15 మంది ఉగ్రవాదుల్లో పది మందిని హతమార్చిన నేపథ్యంలో మిగతా ఐదుగురు ఎక్కడ ఉన్నారన్నదానిపై బారాముల్లా జిల్లాలోని ఉరీ,నవ్‌గామ్ సెక్టార్ల ఎగువ ప్రాంతాల్లో గాలింపుజరిగింది. అలాగే పది మంది ఉగ్రవాదుల మృతదేహాల కోసం అనే్వషణ జరిగినప్పటికీ అవేవీ కూడా లభించలేదు. ఈ గాలింపుచర్యలు ఆధీనరేఖ పొడవునా గంటల తరబడి జరిగాయి. ప్రధానంగా ఎదురుకాల్పులు జరిగింది ఆధీనరేఖ సమీపంలోనే కాబట్టి ఉగ్రవాదులు మృత దేహాలు అక్కడే ఉంటాయని భావించినప్పటికీ అవేవీ కనిపించలేదు. మరోపక్క మరిన్ని చొరబాట్లకు ఉగ్రవాదులు పాల్పడే అవకాశం ఉందన్న కథనాలపై అధికారులు నోరువిప్పడం లేదు. పూర్తి స్థాయిలో ప్రతికూల వాతావరణం నెలకొన్నా ఉగ్రవాదులు మృతదేహాల కోసం మాత్రం విస్తృతంగా గాలింపుజరిగింది. అయితే ఆధీనరేఖ సమీపంలోనే మృతదేహాలు ఉండిఉండవచ్చని అక్కడిదాకా వెళ్లి వాటిని స్వాధీనం చేసుకోడానికి వాతావరణం తీవ్ర ప్రతికూలంగా మారిందని సైనిక వర్గాలు తెలిపాయి. నౌగామ్, ఉరీ సెక్టార్లలో తదుపరి గాలింపుచర్యలు చేపడతామని వెల్లడించాయి. మంగళవారం ఎన్‌కౌంటర్ జరిగిన తరువాత ఉగ్రవాదుల మృతదేహాలు ఆధీనరేఖకు 300 మీటర్ల సమీపంలో ఉన్నట్టుగా గుర్తించామని అధికారులు తెలిపారు. ఈ మృతదేహాలను స్వాధీనం చేసుకునేందుకు ఆధీనరేఖ వరకూ వెళితే శత్రుదేశ సైనికులు కాల్పులకు పాల్పడే అవకాశం ఉంది కాబట్టి భద్రతాదళాలు ఆచీతూచీ అడుగులేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదుల మృతదేహాలు స్వాధీనం అనుమానమేన్న కథనాలు వెలువడుతున్నాయి.