జాతీయ వార్తలు

పద్ధతి మార్చుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ)కి బుధవారం సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. లోధా కమిటీ సిఫార్సుల అమలును వాయిదా వేసుకుంటూ వస్తున్న బోర్డు వైఖరిపై సుప్రీం కోర్టు తీవ్ర పదజాలంతో ఆగ్రహం వ్యక్తం చేసింది. బోర్డు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, సమస్యను పరిష్కరించాలంటే పాలక మండలి మొత్తాన్ని రద్దు చేయాల్సిందేనని కోరుతూ లోధా కమిటీ సమర్పించిన స్టేటస్ రిపోర్ట్‌ను పరిశీలించిన సిజె టిఎస్ ఠాకూర్ నేతృత్వంలోని ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. పద్ధతి మార్చుకోవాలని ఆదేశించింది. చట్టానికి అతీతులమని అనుకుంటే అది ముమ్మాటికే తప్పేనని స్పష్టం చేసింది. సరైన దారికి వస్తే మంచిదని, లేకపోతే ఏ విధంగా దారికి తేవాలో తెలుసునని వ్యాఖ్యానించింది. అక్టోబర్ 6వ తేదీలోగా లోధా కమిటీ సిఫార్సుల అమలు చేయాలని తేల్చిచెప్పింది. ఇదే విధంగా తాత్సారం చేస్తే, ప్రతిపాదనల అమలు కోసం కఠినమైన ఆదేశాలు జారీ చేస్తామని హెచ్చరించింది.