జాతీయ వార్తలు

సిబిఐ అధికారులు చిత్రహింసలు పెట్టారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 28: కొంతమంది సిబిఐ అధికారులు తనను, తన కుటుంబాన్ని చిత్రహింసలు పెట్టారని కుమారుడితోసహా ఆత్మహత్య చేసుకున్న కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మాజీ డైరెక్టర్ జనరల్ బికె బన్సల్ తన సూసైడ్ నోట్‌లో ఆరోపించారు. కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ వాఖలో అదనపు కార్యదర్శి ర్యాంక్ అధికారి అయిన బన్సల్‌ను ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీనుంచి లంచం తీసుకున్నారన్న ఆరోపణపై గత జూలై 16న అరెస్టు చేయడం తెలిసిందే. కాగా, బన్సల్, ఆయన కుమారుడు యోగేష్ రాసిన సూసైడ్ నోట్‌లో సంచలన వివరాలు వెల్లడయ్యాయి. ఈ నెల 18వ తేదీ అర్ధరాత్రి సిబిఐకి చెందిన మహిళా అధికారులు తన భార్యను ఎలా తిట్టి, కొట్టారో బన్సల్ తన ఏడు పేజిల సూసైడ్ నోట్‌లో వివరించారు. డిఐజి ర్యాంక్ ఉన్నతాధికారి ఒకరు తనను నిందించారని, తన కుటుంబాన్ని అంతం చేస్తానని బెదిరించాడని కూడా బన్సల్ ఆ సూసైడ్ నోట్‌లో తెలిపారు.తన కుటుంబాన్ని వేధించిన సిబిఐ అధికార్ల పేర్లను సైతం ఆ సూసైడ్ నోట్‌లో బన్సల్ పేర్కొన్నారు. అంతేకాదు సిబిఐకి చెందిన డిఐజి ర్యాంక్ అధికారిసహా దర్యాప్తు అధికార్ల పాత్రపై దర్యాప్తు జరిపించాలని కూడా ఆయన ఆ నోట్‌లో కోరారు. అరవై ఏళ్ల బన్సల్, ఆయన కుమారుడు యోగేశ్ (30) తమ ఫ్లాట్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.
వారు ఓ సూసైడ్ నోట్ కూడా రాసిపెట్టి చనిపోయారని ఢిల్లీ పోలీసు డిప్యూటీ కమిషనర్ (తూర్పు) రిషిపాల్ సింగ్ చెప్పారు. నీల్‌కాంత్ అపార్ట్‌మెంట్స్‌లోని తమ ఫ్లాట్‌లో భార్య సత్యబాల (58), కుమార్తె నేహా (28) వేర్వేరు రూమ్‌లలో సీలింగ్ ఫ్యాన్లకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న కొద్ది నెలలకే బన్సల్, కుమారుడు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. దర్యాప్తు సందర్భంగా సంబంధిత అధికారులెవరైనా మితిమీరి ప్రవర్తించి ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని సిబిఐ తెలిపింది. సూసైడ్ నోట్‌లో బన్సల్ చేసిన ఆరోపణలను తాము గమనించామని, బన్సల్ చేసిన ఆరోపణలపై దర్యాప్తు జరిపించాలని నిర్ణయించామని సిబిఐ తెలిపింది.