జాతీయ వార్తలు

మేమూ చేయగలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, సెప్టెంబర్ 30: ఆధీన రేఖ ప్రాంతాన్ని ఉల్లంఘించి భారత్ తమ భూభాగంలో ప్రవేశించడం దురాక్రమణేనని పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ నిప్పులు చెరిగారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ ప్రాదేశిక సమగ్రతను పరిరక్షించుకుంటామని, అందుకు అవసరమైన శక్తి సామర్థ్యాలు తమ సైనిక దళాలకు ఉన్నాయని చెప్పారు. భారత్ తరహాలో తాము కూడా మెరపు దాడులు చేయగలమని శుక్రవారం నాడిక్కడ జరిగిన ప్రత్యేక కేబినెట్ సమావేశంలో ఉద్ఘాటించారు. తమ దేశంపై ఎవరు చెడు దృష్టి సారించినా గట్టిగా తిప్పికొడతామని హెచ్చరించారు. భారత్ తమ భూభాగంలోకి వచ్చి దాడి చేయడం దురాక్రమణ చర్యేనని, దీని వల్ల మొత్తం దక్షిణాసియాకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంటుందన్నారు. మాతృ దేశాన్ని పరిరక్షించుకోవడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని, సైనిక దళాలు భుజాలు కలిపి దేశాన్ని రక్షించుకోగలవని నవాజ్ తెలిపారు. ఆధీన రేఖను ఉల్లంఘించేందుకు భారత్ ఎలాంటి ప్రయత్నాలు జరిపినా తిప్పికొడతామని, ఇప్పటికీ శాంతియుత పరిస్థితులను పాదుగొల్పేందుకు తమ వంతు సహకారం అందిస్తామని చెప్పారు. శాంతి కోసం తాము పరితమించడాన్ని తమ బలహీనతగా భావించడానికి వీల్లేదని నవాజ్ ఉద్ఘాటించారు. కాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించిన ఆయన ఆ రాష్ట్ర ప్రజల స్వయం నిర్ణయాధికార హక్కును ఎవరూ కాలరాయలేరన్నారు. అక్కడ జరుగుతున్న భారత దాడులు ఎంత మాత్రం సమంజసం కాదన్నారు. ఉరీపై జరిగిన దాడిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలన్నారు. స్వయంగా ఆ దాడిని సృష్టించుకుని దానికి పాకిస్తాన్‌ను బాధ్యురాలిని చేయడం తమకు ఎంత మాత్రం మింగుడు పడటం లేదన్నారు. తాము లక్షిత దాడుల జరిపామంటూ భారత్ చేసిన ప్రకటనను ఈ ప్రత్యేక కేబినెట్ తిరస్కరించిందని పాకిస్తాన్ రేడియో తెలిపింది. భారత అసలు రూపాన్ని ప్రపంచ దేశాల ముందు బహర్గతం చేస్తామనీ ఆ సమావేశం స్పష్టం చేసినట్టు పేర్కొంది.