జాతీయ వార్తలు

ఇదే చివరి అవకాశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 30: తమిళనాడుకు కావేరి జలాలను విడుదల చేయాలంటూ తాను ఇచ్చిన ఆదేశాలను పదే పదే ఉల్లంఘిస్తున్న కర్నాటకపై సుప్రీంకోర్టు శుక్రవారం తీవ్రస్థాయిలో మండిపడింది. శనివారంనుంచి అక్టోబర్ 6 దాకా రోజుకు 6 వేల క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేసి తీరాలని ఆ రాష్ట్రాన్ని ఆదేశించిన సర్వోన్నత న్యాయస్థానం రాష్ట్రంపై చట్టం కొరడా ఎప్పుడు పడుతుందో ఎవరికీ తెలియదని హెచ్చరించింది. తమిళనాడుకు నీటిని విడుదల చేయడం సాధ్యం కాదంటూ కర్నాటక ఉభయ సభల్లోను ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించినప్పటికీ తమిళనాడుకు ఈ నెల 1వ తేదీనుంచి ఆరో తేదీ దాకా ప్రతి రోజు 6 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడానికి సిద్దరామయ్య ప్రభుత్వానికి సుప్రీంకోర్టు చివరి అవకాశమిచ్చింది. ‘ఒక ప్రభుత్వంగా ఉన్నప్పటికీ కర్నాటక తమ ఆదేశాలను ఉల్లంఘిస్తూ న్యాయ వ్యవస్థ ప్రతిష్ఠకు భంగం కలిగే పరిస్థితిని కలిగిస్తోంది. చట్టాన్ని తప్పకుండా పాటించేలా కఠిన చర్యలు తీసుకోవలసి ఉన్నప్పటికీ ముందు వాస్తవ పరిస్థితిని అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని కావేరి యాజమాన్య బోర్డును ఆదేశించాం’ అని న్యాయమూర్తులు దీపక్ మిశ్రా, యుయు లలిత్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. అలాగే అక్టోబర్ 4 నాటికల్లా కావేరి జలాల నిర్వహణ బోర్డును ఏర్పాటు చేయాలని కేంద్రప్రభుత్వాన్ని బెంచ్ ఆదేశించింది. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి చైర్‌పర్సన్‌గా ఉండే బోర్డులో తమ ప్రతినిధుల పేర్లను శనివారం సాయంత్రం 4 గంటలకల్లా తెలియజేయాలని కావేరి పరీవాహక రాట్రలయిన కర్నాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలను ఆదేశించింది. కర్నాటక ఈ దేశ ఫెడరల్ వ్యవస్థలో భాగమని, పరిస్థితికి తగినట్లుగా నడుచుకుంటుందని, కావేరి జలాల నిర్వహణ బోర్డు వాస్తవ పరిస్థితిపై నివేదిక సమర్పించే వరకు అందుకు భిన్నంగా వ్యవహరించదని తాము భావిస్తున్నామని న్యాయమూర్తులు తెలిపారు. రాజ్యాంగంలోని 144 అధికరణకు కట్టుబడి ఉండి తీరాలని, సుప్రీంకోర్టు ఆదేశాలను తప్పకుండా పాటించి తీరాల్సిన అవసరం ఉందనే విషయాన్ని బెంచ్ కర్నాటకకు గుర్తు చేసింది. ‘అయితే దురదృష్టవశాత్తు కర్నాటక ఒక ప్రభుత్వంగా ఉండి కూడా కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తోంది’ అని బెంచ్ తీవ్రస్వరంతో వ్యాఖ్యానించింది. ఈ దశలో కర్నాటక తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ అడ్వకేట్ తనకు, ముఖ్యమంత్రికి మధ్య జరిగిన ఉత్తరప్రత్యుత్తరాలను ప్రస్తావించారు. కర్నాటక ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేసిందని, సుప్రీంకోర్టు ఆదేశాలను అది పాటించబోదని తమిళనాడు తరఫున వాదించిన సీనియర్ అడ్వకేట్ శేఖర్ నాఫడే అంటూ, తమ రాష్ట్రం తరఫున ఆవేదన వ్యక్తం చేశారు. కాగా తదుపరి విచారణను బెంచ్ వచ్చేనెల 6వ తేదీకి వాయిదా వేసింది.