జాతీయ వార్తలు

‘స్వచ్ఛ భారత్’లో తెలంగాణ పురోగతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 30: తెలంగాణలో బహిరంగ మలమూత్ర విసర్జన లేని 17 పట్టణాల పేర్లను అక్టోబరు 2వ తేదీన ప్రకటిస్తామని రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కె.తారక రామరావు తెలిపారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఇండోపాన్-2016 స్వచ్ఛ భారత్ సదస్సులో కెటిఆర్ పాల్గొన్నారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ, స్వచ్ఛ్భారత్ కార్యక్రమంలో భాగంగా దేశంలో అన్ని రాష్ట్రాలు, జిల్లాలు, గ్రామాలు పూర్తి స్థాయిలో స్వచ్ఛతను సాధించడమే లక్ష్యమన్నారు. బహిరంగ మలమూత్ర విసర్జన లేని దేశంగా భారత్‌ను తీర్చిదిద్దాలంటూ ప్రధాని ఉపన్యాసం సాగిందన్నారు. పారిశుధ్యం, స్వచ్ఛత విషయంలో తెలంగాణ ఇప్పటికే పురోగతి సాధిచిందని, కొన్ని జిల్లాలు, గ్రామాలు పూర్తి స్థాయిలో బహిరంగ మలమూత్ర విసర్జన లేని విధంగా రూపుదిద్దుకున్నాయని కెటిఆర్ చెప్పారు. గాంధీజీ 150వ జయంతి నాటికి తెలంగాణ రాష్టమ్రంతటినీ బహిరంగ మలమూత్ర విజర్జన లేని రాష్ట్రంగా తీర్చిదిద్ధుతామని ఆయన స్పష్టం చేశారు. పాకిస్తాన్‌లోని ఉగ్రవాదుల స్థావరాలపై భారత సైన్యం జరిపిన దాడిని అభినందిస్తున్నట్టు కెటిఆర్ చెప్పారు. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా కేంద్రంతో పాటు సైనిక బలగాలకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన ఉద్ఘాటించారు.