జాతీయ వార్తలు

మూడేళ్లలో స్వచ్ఛ భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 30: దేశం 2019 నాటికి సంపూర్ణ పరిశుభ్రత సాధిస్తుందనే ఆశాభావాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి అధ్యక్షతన శుక్రవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన ఇండోసాన్- 2016 స్వచ్చ భారత్ సదస్సులో చంద్రబాబు పాల్గొన్నారు. ప్రధాని మోదీ స్వచ్ఛత దిశగా వేస్తున్న అడుగులు, తీసుకుంటున్న చర్యలు ఎంతో బాగున్నాయని చంద్రబాబు తనను కలిసిన విలేఖరులతో మాట్లాడుతూ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని పట్టణాలను బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత ప్రాంతాలుగా చేస్తున్నామని ఆయన చెప్పారు. విజయవాడ నుండి దూరదర్శన్ ప్రసారాలు ప్రారంభం కావటం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఆక్రమిత కాశ్మీర్‌లో భారత సైన్యంతో సర్జికల్ దాడులు చేయించిన మోదీ పట్ల దేశం గర్వపడుతోందన్నారు. దాడుల్లో పాల్గొన్న సైనికులను ఆయన కొనియాడారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు ఓడిఎఫ్ సాధించాయనీ, వారంతా కష్టపడి పని చేశారనీ ఆయన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణపై ప్రశంసలు కురిపించారు. ఓడిఎఫ్ వలన దేశానికి ఎంతో మేలు జరుగుతుందనీ, విదేశీ పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఉలిక్కిపడిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశ రాజధానిలో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో శుక్రవారం ఆయన ఇడోపాన్-2016 స్వచ్ఛ్భారత్ సదస్సుకు హాజరైనప్పుడు ఈ ఘటన జరిగింది. ఈ సదస్సు గురించి చంద్రబాబు విలేఖరులతో మాట్లాడుతున్న సమయంలో విజ్ఞాన్ భవన్‌లోని సెంట్రలైజ్డ్ ఏసి సిలిండర్ పెద్ధ శబ్దంతో పేలడం ఆయన ఉలికిపాటుకు కారణం. దాంతో అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది, అధికారులు చంద్రబాబును బయటికి తీసుకెళ్లారు.

చిత్రం... న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో శుక్రవారం ఇండోసాన్ సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు తదితరులు