జాతీయ వార్తలు

చౌక వైద్యం ఇప్పటికీ ఓ సవాలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, డిసెంబర్ 23: తక్కువ ధరకు వైద్య చికిత్స అనేది ఇప్పటికీ ఒక పెద్ద సవాలుగానే ఉందని, క్యాన్సర్ చికిత్స ఖర్చును అందరికీ అందుబాటులో ఉండేలా చేయడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రమైన కృషి చేస్తున్నాయని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ చెప్పారు. భరించగలిగే వైద్య చికిత్స అనేది మన దేశంలో ఇప్పటికీ సవాలుగానే ఉంటోంది. క్యాన్సర్ చికిత్స వ్యయం రానురాను పెరిగిపోతోందని, ఎందుకంటే చికిత్సకు అవసరమైన శిక్షణ పొందిన సిబ్బంది, పరికరాలపై భారీగా పెట్టుబడి పెట్టాల్సి వస్తోందని బుధవారం ఇక్కడ కిద్వాయ్ మెమోరియల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీకి చెందిన క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌కు శంకుస్థాపన చేస్తూ రాష్టప్రతి అన్నారు. అయితే క్యాన్సర్ చికిత్స ఖర్చును తగ్గించడానికి అటు కేంద్ర, ఇటు రాష్ట్రప్రభుత్వాలు కూడా కృషి చేస్తున్నాయని ఆయన అన్నారు.
రోగులు, వారి కుటుంబ సభ్యుల కష్టాలు తగ్గించడానికి అన్ని ఏజన్సీలు కలిసికట్టుగా నిరంతరం కృషి చేయాలన్సిన అవసరం ఉందని రాష్టప్రతి అన్నారు. క్యాన్సర్‌ను ప్రాథమిక దశలోనే గుర్తించడంతో పాటుగా వ్యాధికి సరయిన చికిత్స అందించడానికి, అలాగే టెక్నాలజీని ఎంతమేరకు సద్వినియోగం చేసుకోవచ్చనేదానికోసం భారత దేశం ఒక వ్యవస్థను రూపొందించాల్సిన అవసరం ఉం దని ఆయన చెప్పారు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ వ్యాధి పెరుగుతోందని, భారత దేశం లో సైతం క్యాన్సర్ కేసులు గణనీయం గా పెరుగుతున్నాయని ప్రణబ్ చెప్పా రు. ‘్భరతీయ వైద్య పరిశోధనా మం డలి (ఐసిఎంఆర్) గణాంకాల ప్రకారం పట్టణ ప్రాంతాల్లో పురుషుల్లో ప్రతి 15 మందిలో ఒకరికి, మహిళల్లో ప్రతి 12 మందిలో ఒకరికి వారి జీవిత కాలంలో క్యాన్సర్ సోకే అవకాశం ఉంది’ అని అన్నారు. క్యాన్స ర్, దానికి సంబంధించిన సమస్యలపైన ఒక నిర్దుష్టమైన డేటాను రూపొందించాలనే లక్ష్యంతో ఐసిఎంఆర్ క్యాన్సర్ ను ఒక గుర్తించదగిన వ్యాధిగా చేయడానికి కృషి చేసిందని ప్రణబ్ చెప్పా రు. క్యాన్సర్ వ్యాధిని గుర్తించడంతో పాటుగా దాని చికిత్స, అదుపునకు అవసరమైన వనరులను సమకూర్చుకోవడానికి ఇది తోడ్పడుతుందని అన్నారు. వ్యాధి తీవ్రతను అర్థం చేసుకుని మరింత సమగ్రమైన, నిర్దుష్టమైన కేన్సర్ చికిత్సా విధానాన్ని రూపొందించడానికి విశ్వసనీయమైన డేటా తోడ్పడుతుందని కూడా రాష్టప్రతి అన్నారు.

చిత్రం... క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌కు శంకుస్థాపన చేస్తున్న రాష్టప్రతి ప్రణబ్