జాతీయ వార్తలు

దాయాదికి మరో ఎదురుదెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 30: ఉగ్రవాదానికి ప్రధాన కేంద్రంగా మారిన పాకిస్తాన్‌కు దౌత్యపరంగా దెబ్బమీద పెద్ద ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పాక్‌లో జరుగనున్న సార్క్ (దక్షిణాసియా ప్రాంతీయ సహకార సమాఖ్య) సభ్య దేశాల 19వ శిఖరాగ్ర సమావేశానికి భారత్, భూటాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ మాదిరిగానే తాము కూడా హాజరయ్యేది లేదని శ్రీలంక, మాల్దీవులు శుక్రవారం స్పష్టం చేశాయి. ఇస్లామాబాద్‌లో నవంబర్ 9, 10 తేదీల్లో జరగాల్సి ఉన్న ఈ సమావేశం నుంచి వైదొలుగుతున్నట్లు శ్రీలంక ప్రకటించింది. ప్రస్తుతం సార్క్‌కు అధ్యక్షత వహిస్తున్న శ్రీలంక నేపాల్‌కు పంపిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రస్తుతం సార్క్ శిఖరాగ్ర సమావేశ నిర్వహణకు పరిస్థితులు అనుకూలంగా లేవని శ్రీలంక ఆ ప్రకటనలో పేర్కొంది. ‘ప్రాంతీయ స్థాయిలో సహకారం విజయవంతమై దక్షిణాసియా ప్రజలకు ప్రయోజనం చేకూరాలంటే శాంతి, భద్రతలు ఎంతో ప్రధానం. ప్రాంతీయ సహకారం ముందుకు సాగేందుకు అనువైన పరిస్థితులను సృష్టించేందుకు వీలుగా ఈ ప్రాంతంలో శాంతి, భద్రతలను మెరుగుపర్చిందుకు తగిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాం’ అని శ్రీలంక పేర్కొంది.